ఒంటిగారిపల్లెలో కుంగుతున్న భూమి

ABN , First Publish Date - 2020-11-30T04:56:02+05:30 IST

మండల పరిధి ఒంటిగారిపల్లెలో భూమి కుంగిపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒంటిగారిపల్లెలో కుంగుతున్న భూమి
ఉత్తమారెడ్డి ఇంటి ముందు కుంగిపోయిన చప్పట

ముద్దనూరు నవంబరు29:మండల పరిధి ఒంటిగారిపల్లెలో భూమి కుంగిపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామికొండ రిజర్వాయరుకు నీరు చేరడంతో గ్రామంలో ఊటలు దిగుతున్నాయని దీంతో ఉత్తమారెడ్డి ఇంటి  ముందు ఉన్న బండల చప్పట కుంగిపోయిందన్నారు. అలాగే కదిరి వెంకటసుబ్బమ్మ అనే మహిళ ఇంటి పునాది తగ్గడంతో భయపడిపోతు న్నారన్నారు. ఎండిపోయిన చేదుడు బావిలో 3 అడుగులలోపు నీరు చేరాయని ఇంకా రెండు రోజుల పాటు తుఫాన్‌ ఉందని భయంతో గ్రామంలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గ్రామస్థులు తెలిపారు. వామికొండ రిజర్వాయరు వల్ల గ్రామానికి ముప్పు ఉందని అనేక మార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్న వించినా ఎవ్వ రూ పట్టించుకోలేదన్నారు. ఏదైనా జరుగరానికి జరుగుతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు కోరుతున్నారు.ఎటువంటి ప్రమాదం జరుగక ముందే తమను ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-30T04:56:02+05:30 IST