కన్వర్షన్‌కు కాసులు..

ABN , First Publish Date - 2021-12-04T05:29:07+05:30 IST

భూస్వభావ మార్పు అనేది పెద్ద ప్రక్రియ. అయితే జిల్లాలో భూమి వినియోగ మార్పి డులు నిబంధనల కు విరుద్ధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

కన్వర్షన్‌కు కాసులు..

జోరుగా భూ మార్పిడులు

వ్యవసాయ భూములు కనుమరుగు

జాతీయ రహదారులపక్కన డిమాండ్‌

కిందిస్థాయిలో చేతులు మారుతున్న నగదు


గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భూస్వభావ మార్పు అనేది పెద్ద ప్రక్రియ. అయితే జిల్లాలో భూమి వినియోగ మార్పి డులు నిబంధనల కు విరుద్ధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమం లో కిం దిస్థాయిలో పని చేసే రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ముఖ్యంగా తెనాలి డివిజన్‌లో  ఇది అధికంగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు కనుమరుగైపో తున్నాయి. పంట పొలాలు కాస్తా వెంచర్లుగా మారుతున్నాయి. బాపట్ల, రేపల్లె వైపున అయితే చేపల చెరువులుగా రూపాంతరం చెందుతున్నాయి. భూస్వభావ మార్పులు చేసుకోవ డానికి వచ్చే వారిని ఉన్నతాధికా రులను కలవనీయ కుండా కిందిస్థాయి సిబ్బంది మేనేజ్‌ చేస్తూ అందిన  కాడికి వెన కేసుకుంటున్నట్లు రెవెన్యూ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. 


భూయజమానులతో బేరసారాలు..

కన్వర్షన్‌కు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి తొలుత ప్రతిపాదనలు వస్తాయి. ఆ తర్వాత ఆర్డీవో వద్దకు ఫైలు వెళుతుంది. ఐదు ఎకరాల లోపు భూమి అయితే ఆర్డీవో స్థాయిలోనే అంతా జరిగిపోతుంది. అంత కంటే ఎక్కువ విస్తీర్ణం అయితేనే జాయింట్‌ కలెక్టర్‌కి ఫైలు వస్తుంది. ఈ దృష్ట్యా ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం భూములు అయితే తొలుత అంతకంటే తక్కువ విస్తీర్ణం లో కన్వర్షన్‌ చేయించుకుని ఆ తర్వాత మరో దఫా మిగిలిన భూమిని ఆర్డీవో స్థాయిలోనే చేయించేసుకుంటు న్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కిందిస్థాయి సిబ్బంది ఫైలులో చేసిన ప్రతిపాదనలు, రి మార్కులనే ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని సంతకం చేసేస్తుంటారు. ఇదే అదనుగా కిందిస్థాయి సిబ్బంది ముందే భూయజమా నులతో బేరసారాలు మాట్లాడు కుని ఒప్పందం చేసుకున్న తర్వాత ఫైలు పెడుతు న్నారు. జలవనరులకు సంబంధించి ఎలాంటి భూ ములనైనా ల్యాండ్‌ కన్వర్షన్‌కి పెట్టకూ డదు. అయిన ప్పటికీ కొంతమంది తమ పైఅధికారులను తప్పు దారి పట్టిస్తూ ఫైలు పెడుతున్నారు.


అధికంగా ఎన్‌హెచ్‌-216 మార్గంలో...

రేపల్లె నుంచి బాపట్ల మీదగా ఎన్‌హెచ్‌- 216 నాలుగు వరసలుగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ మార్గం పొడ వునా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టుకొస్తున్నా యి. ఇందుకోసం ల్యాండ్‌ కన్వర్షన్స్‌ ఎక్కువగా ఆ రహదారి సాగే మండలాల్లోనే జరుగుతు న్నాయి. ఈ క్రమంలో భూయజమానులతో ముందుగానే ఎకరానికి భూమి విలువ బట్టి రూ.లక్షకి తగ్గకుండా పర్సంటేజీ మాట్లాడుకు ని ఆ తర్వాతనే ల్యాండ్‌ కన్వర్షన్‌ చే పడుతు న్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలేవేరే మం డలం నుంచి బదిలీపై వచ్చిన అధికారి ఒకరు సర్వం తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రెవెన్యూవర్గాలు చర్చించు కుంటున్నాయి. 


Updated Date - 2021-12-04T05:29:07+05:30 IST