Advertisement

భూముల విలువ పెరగడంతో అమ్మిన ప్లాట్లకు ఫెన్సింగ్‌

Jan 23 2021 @ 23:08PM
రిజిస్ర్టేషన్‌ పత్రాలు చూపుతున్న బాధితులు

చట్టంలో లొసుగులత అడ్డంతిరుగుతున్న వైనం

కొనుగోలు చేసిన వారికి తప్పని పాట్లు 

పోరాటానికి సిద్ధమవుతున్న బాధితులు

ఖమ్మం, జనవరి23 (ఆంధ్రజ్యోతిప్రతినిధి):  ఖమ్మం సమీప మండలాల్లో ప్లాట్ల ధరలు పెరుగుతుండడంతో గతంలో అమ్మిన భూ యజమానులు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. అనధికారిక లేఅవుట్లతో ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్న భూయజమానులు.. కొన్న వారిని  ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రఘునాధపాలెం మండలంలోని రేగులచలక గ్రామ పరిధిలో సుమారు ఏడు ప్లాట్లు చేసి విక్రయించిన భూయజమానులు ఇప్పుడు ఆభూములు తమవే అని ఫెన్సింగ్‌ వేయడంతో బాధితులు పోరాటనికి సిద్ధమవుతున్నారు. 2007, 2008లో సుమారు ఏడు ఎకరాల స్థలంలో అక్కడ వెంచర్‌గా చేసి గజం రూ.1000నుంచి 1500ల చొప్పున విక్రయించారు. ఇప్పుడు ఆభూముల ధర గజం రూ.5వేలు దాటడంతో ప్లాట్లుకోసం భూమి అమ్మిన యజమానులు అడ్డం తిరుగుతున్నారు. తమ పేరుమీద పాసుపుస్తకాలు తెప్పించుకుని  ఫెన్సింగ్‌ వేయడంతో కొనుగోలుచేసిన వారు లబోదిబోమంటున్నారు. అనధికారిక లేఅవుట్‌కావడంతో రిజిస్ర్టేషన్‌శాఖలో ప్లాట్లకు రిజిస్ర్టేషన్‌ అయినా రెవెన్యూలో సాగుభూములుగా ఉన్నాయి. ల్యాండ్‌కన్వర్షన్‌ కాకపోవడంతో భూమిసాగులో గతంలో ఉన్న యజమాని పేరే ఉంది. కొనుగోలు చేసిన ప్లాట్లయజమానులు తమకు రిజిస్ర్టేషన్‌ అయిందన్న ధీమాతో ఉనన్నారు. భూయజమానికి పాసుబుక్కులు ఉండడంతో తాము ఎవరికి భూములు అమ్మలేదని  భూముల్లో ఫెన్సింగ్‌వేసుకున్నారు. శనివారం జిల్లాలో పలుచోట్ల ఉన్న ప్లాట్ల యజమానులు ఖమ్మం ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంవద్ద సమావేశమయ్యారు. సోమవారం నుంచి ధర్నాచౌక్‌లో కుటుంబసభ్యులతో దీక్షకు దిగుతామని ప్లాట్ల యజమానులు పేర్కొన్నారు. 

Follow Us on:
Advertisement