భూములకు రక్షణ కల్పించేందుకు సమగ్ర సర్వే చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T06:26:24+05:30 IST

భూములకు రక్షణ కల్పించేందుకు సర్వే పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ప్రధాన సల హాదారులు అజయ్‌కల్లం ఆదేశించారు.

భూములకు రక్షణ కల్పించేందుకు సమగ్ర సర్వే చేయాలి
మాట్లాడుతున్న అజయ్‌ కల్లం

సీఎం ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లం


ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 23 : భూములకు రక్షణ కల్పించేందుకు సర్వే పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ప్రధాన సల హాదారులు అజయ్‌కల్లం ఆదేశించారు. స్థానిక కలెక్టరే ట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం భూముల రీ సర్వే పనుల పురోగతిపై రెవెన్యూ అధికారులతో నిర్వ హించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రె తులకు సంబంధించిన వివాదాలు లేకుండా ప్రభుత్వం రీసర్వే చేపట్టేందుకు చట్టం తెచ్చిందన్నారు.   రాష్ట్రం లో వందేళ్ళ క్రితం రీసర్వే జరిగిందని, ప్రభుత్వ అధికా రులు సర్వే బాధ్యతలను అదృష్టంగా భావించాలన్నా రు. జీవితంలో ఇలాంటి సర్వీసు మరలా రాదన్నారు. జిల్లాలో భూములకు సంబంధించిన రీసర్వే పూర్తి చేసి ప్రజలకు హద్దులు చూపించాలన్నారు.  కలెక్టర్‌ ప్రవీ ణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్షపథకం కింద ఒంగోలు మ ండలం చిన్నమల్లేశ్వరపురం, కందుకూరు డివిజన్‌లో ఎస్‌ఎంవీకండ్రిక, మార్కాపురం డివిజన్‌లో శివరామపు రం గ్రామాల్లో సర్వే జరుగుతుందని తెలిపారు. సమా వేశంలో జేసీలు వెంకటమురళీ, చేతన్‌, కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజిత్‌సింగ్‌, స్పెషల్‌ కలెక్టర్‌ సరళావం దనం, డిప్యూటీకలెక్టర్‌ శ్రీదేవి, డీపీవో నారాయణరెడ్డి, ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీశివజ్యోతి, డీఆర్‌డీఏ పీడీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన అజయ్‌కల్లంకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ వెంకటమురళి బొకేలు ఇచ్చి స్వా గతం పలికారు.


Updated Date - 2021-07-24T06:26:24+05:30 IST