భూములను పకడ్బందీగా రీసర్వే చేస్తాం

ABN , First Publish Date - 2021-01-17T04:45:00+05:30 IST

ఆలూరు భూముల ఆర్‌ఎ్‌సఆర్‌లను పకడ్బందీగా సర్వే చేసి ఆర్‌ఎ్‌సఆర్‌ను అప్‌డేట్‌ చేసి భూమి హక్కు పత్రాలను భూ హక్కుదారులకు అందించేందుకు ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు పథకాన్ని ప్రవేశపెట్టి రీసర్వే చేసేందకు శ్రీకారం చుట్టిందని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి అన్నారు.

భూములను పకడ్బందీగా రీసర్వే చేస్తాం

  ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి

 

ఆలూరు, జనవరి 16: ఆలూరు భూముల ఆర్‌ఎ్‌సఆర్‌లను పకడ్బందీగా సర్వే చేసి ఆర్‌ఎ్‌సఆర్‌ను అప్‌డేట్‌ చేసి భూమి హక్కు పత్రాలను భూ హక్కుదారులకు అందించేందుకు ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు పథకాన్ని ప్రవేశపెట్టి రీసర్వే చేసేందకు శ్రీకారం చుట్టిందని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆలూరు మండలంలోని కాత్రికి గ్రామంలో భూ రీసర్వేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూమి హక్కు పత్రాలను భూ హక్కుదారులకు అందిస్తామన్నారు. గ్రామంలో ఉన్న భూమి విస్తరణ, మిగులు భూములు గుర్తించి కొత్తగా రికార్డులు తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హుసేన్‌, సబ్‌సర్వేయర్‌ ఈశ్వర్‌ప్రసాద్‌, కౌతాళం డిప్యూటీ తహసీల్దార్‌ రామేశ్వర్‌రెడ్డి, వైసీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, హరిచంద్రరెడ్డి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-17T04:45:00+05:30 IST