రైతుల సమక్షంలోనే రాళ్లు..

ABN , First Publish Date - 2021-04-23T10:33:12+05:30 IST

భూముల సర్వేలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో భూముల సర్వే చేస్తున్న క్రమంలో రైతుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

రైతుల సమక్షంలోనే రాళ్లు..

భూముల సర్వేలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో భూముల సర్వే చేస్తున్న క్రమంలో రైతుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదని సీఎం ఖరాఖండిగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘‘సర్వే అనేదే రైతుల సమస్యలు, సందేహాలు తీర్చడానికి. కాబట్టి వారి సమక్షంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో వారు సంతృప్తిగా ఉండాలి. సరిహద్దు రాళ్ల ఏర్పాటు పేరిట రైతుల నుంచి ఒక్కరూపాయి కూడా వసూలు చేయవద్దని సీఎం స్పష్టం చేశారు. అంటే ఉచితంగానే రైతులకు సరిహద్దు రాళ్లు అందించాల్సి ఉంది. కాగా, సర్వే పూర్తయిన తర్వాత భూమికి సంబంధించిన రైతుకు సరిహద్దులను పక్కాగా చూపించాలని సీఎం చెప్పారు.


ఈ విషయాలపై స్పష్టత ఇస్తూ ప్రతీ గ్రామ పంచాయతీ కార్యాలయం పరిధిలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 51 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయ్యేనాటికి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషారాణి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌, సర్వే కమిషనర్‌ సిద్థార్ధ్‌జైన్‌, సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T10:33:12+05:30 IST