మూడేళ్లలో భూముల సర్వే పూర్తి

ABN , First Publish Date - 2021-06-18T05:26:14+05:30 IST

మూడేళ్లలో భూముల సర్వే పూర్తి

మూడేళ్లలో భూముల సర్వే పూర్తి
పరశురాంపురంలో భూముల సర్వేను ప్రారంభిస్తున్న కృష్ణదాస్‌

- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌

పాలకొండ: భూముల సమగ్ర సర్వే మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని రెవెన్యూశాఖ మంత్రి, ఉప ముఖ్యమ్రంతి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. గురువారం మండలంలోని పరశురాంపురంలో శాశ్వతభూహక్కు-భూరక్ష (రీసర్వే)ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ రికార్డుల స్వచ్ఛీకరణకు రూ.983 కోట్లు  కేటాయించినట్లు తెలిపారు. రెవెన్యూ, సర్వే శాఖల్లోని 4,500 మంది సిబ్బంది భూముల సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు.  కలెక్టర్‌ శ్రీకేష్‌లఠ్కర్‌, డీసీసీబీ  మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీ రఘువర్మ, ఎమ్మెల్యే కళావతి మాట్లాడారు. డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐలు సీహెచ్‌ ప్రసాద్‌, భాస్కరరావు, మహమ్మద్‌ ఆలీ బందోబస్తు నిర్వహించారు.  కార్యక్రమంలో  జేసీ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీధర్‌, ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ పాల్గొన్నారు.

- విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌ తెలిపారు. పరశురాంపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్తి పన్ను 10శాతం కంటే ఎక్కువ పెరగదని, అది కూడా దశలవా రీగా పెరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రికి విమర్శించడమే పనిగా పెట్టుకోవడం ప్రతిపక్షాలకు తగద న్నారు. ఇళ్లు నిర్మిస్తామన్న వారికి ప్రభుత్వం స్థలం, రుణం ఇస్తుందన్నారు.

- పాల కొండలో కృష్ణదాస్‌కు ఘన స్వాగతం లభించింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ నాయకుడు పాలవలస రాజశేఖరం స్వగృహం వద్ద  పలువురు స్వాగతం పలికారు.

 

వేణుగోపాలుడిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం

గార : శాలిహుండంలోని కాళీయమర్దన వేణుగోపాలస్వామిని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జడ్పీ మాజీ చైర్మన్‌ మార్పు ధర్మారావు, గార సర్పంచ్‌ దుర్గాబాబు ఉన్నారు.



Updated Date - 2021-06-18T05:26:14+05:30 IST