త్వరలో భూ సర్వే

ABN , First Publish Date - 2020-09-11T10:58:42+05:30 IST

గతంలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం తాజాగా భూ సర్వే చేపట్టేందుకు సిద్ధమవు తోంది. ప్రతీ భూమికి

త్వరలో భూ సర్వే

ధరణి పోర్టల్‌లో పహాణి, లింకు డాక్యుమెంట్‌, పాస్‌బుక్‌, ఈసీ వివరాలు

రెవెన్యూ కోర్టుల రద్దు, మిగిలిన కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్‌

ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే రిజిస్ట్రేషన్‌ తీసుకోదు

రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యూటేషన్‌

కొత్త చట్టంపై జిల్లాలో హర్షాతిరేకాలు


కామారెడ్డి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): గతంలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం తాజాగా భూ సర్వే చేపట్టేందుకు సిద్ధమవు తోంది. ప్రతీ భూమికి సంబంధించి సర్వే చేపట్టనుంది. ఈ భూముల అక్షాంశం- రేఖాంశం నిర్ధారించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టాలని యోచిస్తోంది. బుధవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఇకపై భూములకు సంబంధించి ధరణి పోర్ట ల్‌లో పూర్తి సమాచారం నిక్షిప్తం చేయనున్నారు. ఈ పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవ సాయేతర భూ ములుగా రెండు భాగాలు ఉండ నున్నాయి. వ్యవసా య భూములు మినహాయించి అట వీ, ప్రభుత్వ, గ్రామ కంఠం, పట్టణ, పబ్లిక్‌ యూటిలిటీ భూములన్నింటిని వ్యవసా యేతర భూము లుగా ఒక భాగంలో పరిగణిస్తారు. భూములకు సంబంధించి పహాణి నకల్‌, లింక్‌ డాక్యు మెంట్‌, ఇన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ) వివరాలన్నీ పోర్టల్‌లో ఉంటాయి. ఇది మల్టిపుల్‌ సర్వర్‌లో ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉండడంతో ఎవరు, ఎప్పుడైన, ఎక్కడైనా వీటిని ఓపెన్‌ చేసి డౌన్‌లోడ్‌, కాపీ చేసుకునేలా రూపొందించారు.


రిజిస్ట్రేషన్‌ తీసుకోదు

ధరణి పోర్టల్‌లో ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ప్రధాన ంగా కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసుకోరాని విధంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నారు. తద్వారా ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ జరగదు. అనేక ప్రభుత్వ భూము లను అన్యాక్రాంతం చేస్తున్న వారికి ఇది చెక్‌ పెట్టనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఒకరి పేరుమీద ఉన్న భూమిని మరొకరు రిజిస్ట్రేషన్‌ చేసు కునే వీలు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు.


రెవెన్యూ కోర్టుల రద్దు

వీఆర్‌వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇచ్చేలా చర్యలు చేపడతామనడంతో సీఎం చిత్రపటానికి వీఆర్‌ఏలు క్షీరాభిషేకం నిర్వహించి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లాలో అలాగే రెవెన్యూ కోర్డులను ప్రభుత్వం రద్దు చేసిం ది. తహసీల్దార్‌, ఆర్‌డీవో, అదనపు కలెక్టర్లకు అనుబంధంగా రెవెన్యూ కోర్టులు నడుస్తున్నాయి. ప్రభుత్వం వీటిని రద్దు చేసి ప్రస్తుతం ఈ కోర్టుల్లో నడుస్తున్న కేసులకు సంబం ధించి ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యూనళ్లను ఏర్పాటు చేసి పరిష్కరిం చనున్నారు. ఇకపై భూములకు సంబంధించి వివాదాల ను న్యాయ సంబంధిత కోర్టుల్లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యూటేషన్‌

వ్యవసాయభూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం తహసీల్దార్‌లకు కల్పిస్తూ వారిని జాయింట్‌ సబ్‌ రిజిస్టర్‌లుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. అలాగే వ్యవసాయేతర భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ అధికారాలను ప్రస్తుతం ఉన్నటువంటి రిజిష్ర్టార్‌ కార్యాలయాలకు కల్పించింది. ఇక్కడ సబ్‌ రిజిస్ట్రా ర్‌ ఆధ్వర్యంలోనే వ్యవసాయేతర భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిరంతరం జరుగుతాయి. ప్రధానంగా ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తూ అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు నిలివేయడంతో కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు ఉంటాయోననే ఆసక్తి అందరిలో కలిగించింది. అయితే వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్‌లకు, వ్యవసాయేతర భూములకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు కల్పించడంతో దీనిపై స్పష్టత వచ్చింది.


ఇదిలా ఉంటే భూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ వ్యవహారాలన్నీ తక్షణం జరిగేలా ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఐటి టేబుల్‌ ద్వారా అప్పటి కప్పుడు మార్పులు చేర్పులు చేసేలా చర్యలు చేపడుతోంది. తద్వారా రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించనున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం చేపడుతున్న భూసర్వేను పూర్తిగా డిజిటలైజ్‌ చేయనున్నారు. తద్వారా భూములకు సంబంధించి డిజిటలైజ్‌ మ్యాప్‌ కూడా ఇందులో ఉంచనున్నారు. ప్రతీ మండలం, జిల్లా వివరాలు ధరణిలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా భూములకు సంబంధించిన వివాదాలకు తెరపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.


కుల, ఆదాయ సర్టిఫికెట్లు కూడా

కుల ధ్రువీకరణ పత్రం ప్రతీ అవసరానికి తీసుకునేలా కాకుండా ఇక పై కంప్యూటరైజ్‌లో ఒకేసారి ఇవ్వడం ద్వారా ప్రతీ దానికి శాశ్వత ప్రాతి పదిక చేయనున్నారు. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలను గ్రామ పంచా యతీ, మున్సిపాలిటీల ద్వారా జారీ చేసేలా ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే ఆదాయ సర్టిఫికెట్‌కు సంబంధించి డాటాబేస్‌ విధానంతో మార్పు లు, చేర్పులు చేస్తూ జారీ చేయనున్నారు. ప్రధానంగా ఆస్తుల వివరాల న్నీ ఆన్‌లైన్‌ కానుండడంతో ఆ డాటాబేస్‌ విధానంలో ఆదాయ సంబం ధిత హెచ్చుతగ్గుల ఆధారంగా డాటాబేస్‌ను సరిచేయనున్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్‌లోనే పోందే అవకాశం కల్పిస్తున్నారు.

Updated Date - 2020-09-11T10:58:42+05:30 IST