Advertisement

భూరాబంధుల కోరళ్లో నుంచి రక్షించండి

Aug 8 2020 @ 00:55AM

భూ బాధితులు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ డిమాండ్‌


కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 7: భూ రాబంధుల నుంచి రక్షణ కల్పిచాలని బొమ్మకల్‌ భూబాధితులు, లోక్‌సత్తా ఉద్యమ  సంస్థ నాయకులు సీఎం, గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఫిలింభవన్‌లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్‌ హోదాలో ఉన్న పురుమల్ల శ్రీనివాస్‌ ప్రజల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.


సర్పంచ్‌తోపాటు అతనికి ఈ అక్రమదందాలో సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బొమ్మకల్‌ గ్రామపరిధిలో 32సర్వేనెంబ ర్‌లలో ఉన్న రూ.100కోట్లపైగా విలువైన దాదాపు 200ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట 50వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధులు నరెడ్ల శ్రీనివాస్‌, ప్రకాశ్‌హొల్లా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను, చివరకు శ్మశానవాటిక భూములను కూడా ఈ కబ్జాదారులు వదలలేదన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ అకమ్రదందాపై చర్యలు తీసుకోలే దని, చివరకు లోక్‌సత్తా ఉద్యమసంస్థ ఇటీవల లోక్‌యుక్తలో కేసుదాఖలు చేసిందన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement