తనఖాలోని భూముల విడుదల

ABN , First Publish Date - 2022-01-23T05:04:45+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి భూమి కొనుగోలు పథకం ద్వారా ఎస్సీ లబ్ధిదారులు పొందిన భూములు తనఖా నుంచి విడుదల అయ్యాయని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పీ సారయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తనఖాలోని భూముల విడుదల

నెల్లూరు ( వీఆర్సీ ) జనవరి 22 : ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి భూమి కొనుగోలు పథకం ద్వారా  ఎస్సీ లబ్ధిదారులు పొందిన భూములు తనఖా నుంచి విడుదల అయ్యాయని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పీ సారయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2009కి ముందు ఎస్సీ కార్పొరేషన్‌ భూమి కొనుగోలు పథకం ద్వారా ఎస్సీ కుటుంబాలకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణంతో భూమిని కొనుగోలు ఇచ్చిందని తెలిపారు. నాటినుంచి అవి ఎస్సీ కార్పొరేషన్‌ పేరున తనఖాలో ఉన్నాయని  పేర్కొన్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం రూ.1లక్ష లోపు రుణాలను రద్దు చేసిన నేపధ్యంలో ఆ భూములపై ఎస్సీలకు సర్వహక్కులు కల్పించడంతో పాటు రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు. లబ్ధిదారులు సంబంధిత తహసీల్దారు వద్ద తమ ఆధార్‌, రేషన్‌ కార్డులు, భూమి వివరాలను అందించాలని కోరారు.

Updated Date - 2022-01-23T05:04:45+05:30 IST