భూమల రీసర్వేతో రికార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌

ABN , First Publish Date - 2021-07-30T06:42:44+05:30 IST

భూముల రీసర్వేతో రికార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌ పెడుతున్నట్లు తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య అన్నారు. రీసర్వే కార్యక్రమంలో భాగంగా మొదటివిడతగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద సూరాయపాలెం గ్రామంలో చేపడుతున్న సర్వేను గురువారం ఆయన పరిశీలించారు.

భూమల రీసర్వేతో రికార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌
సర్వేకు సిద్ధంగా ఉన్న డ్రోన్‌

తాళ్లూరు, జూలై 29 : భూముల రీసర్వేతో రికార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌ పెడుతున్నట్లు తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య అన్నారు. రీసర్వే కార్యక్రమంలో భాగంగా మొదటివిడతగా పైలట్‌  ప్రాజెక్ట్‌ కింద సూరాయపాలెం గ్రామంలో చేపడుతున్న సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ.. సర్వేతో భూసమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, కార్స్‌ టెక్నాలజీ, రోవర్లు వినియోగించి భూముల రిసర్వే చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయభూములతో పాటు, వ్యవసాయేతర భూములను రీసర్వే చేస్తున్నారన్నారు.సర్వేద్వారా గుర్తించిన భూములను జీపీఎస్‌ ద్వారా ఫోటోలు తీసి, వాటిని ప్రాసె్‌సచేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ చేయనున్నట్లు తెలిపారు.  డ్రోన్‌ల ద్వారా స్పష్టంగా కనిపించేలా గ్రామకంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫొటోలు తీసి భద్రపరుస్తామన్నారు. ప్రతి ఆస్తికి ఒక యూనిక్‌ నంబర్‌ కేటాయించి ఆ వివరాలన్నింటిని నమోదు చేస్తూ రెవెన్యూ రికార్డులను సవరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ అంజనీదేవి, సర్వేయర్లు రాజు, ప్రశాంత్‌, వీఆర్‌వో మన్నేపల్లి నాగేశ్వరరావు, గ్రామకార్యదర్శి షేక్‌ షహనాజ్‌బేగం, గ్రామసర్పంచ్‌ శ్యాంసన్‌, విిలేజ్‌ సర్వేయర్లు , రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:42:44+05:30 IST