ఆ భూములు రైతులకు అప్పగించాలి

ABN , First Publish Date - 2021-11-28T04:14:13+05:30 IST

మండలంలోని తువ్వపాడు, పాతపా డు, నాగరాజుకుంట తదితర గ్రామా లలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను రైతులకు అప్పగించా లని మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆ భూములు రైతులకు అప్పగించాలి
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల


మాజీ ఎమ్మెల్యే కందుల

కొనకనమిట్ల, నవంబరు 27: మండలంలోని తువ్వపాడు, పాతపా డు, నాగరాజుకుంట తదితర గ్రామా లలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను రైతులకు అప్పగించా లని మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి  డిమాండ్‌ చేశారు. శనివా రం తహసీల్దార్‌ రాధాకృష్ణను కలిసి సమస్యను వివరించారు. ఈసం దర్భంగా కందుల మాట్లాడుతూ తువ్వపాడు, పాతపాడు, నాగరాజు కుంట తదితర గ్రామాలలో  40 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తున్నారన్నారు. గతంలో వారు పాసుపుస్తకాలు పొంది ఉన్న భూ ములను  వైసీపీ నాయకులు దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్ని స్తున్నారని అన్నారు.   కబ్జాకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవల్సింది పోయి రైతులకు అన్యాయం చేయడమేంటని కందుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగులో ఉన్న రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో తొలగించడం వంటి చర్యలకు  కూ డా వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని కందు ల అన్నారు. ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూ ముల వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించడం ఏ మిటని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వైసీపీ నా యకులు, కార్యకర్తల భూములను ఆన్‌లైన్‌లో ఇ లాగే తొలగిస్తారా అన్నారు. అధికార పార్టీ నాయ కుల మాటులు విని అధికారులు ఇలాంటి పను లు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులలపై కక్షసాదింపు చర్యలు సరికాదని కందుల పేర్కొన్నారు. 

ఆయనవెంట కొనకనమిట్ల, తర్లుపాడు మండల టీడీపీ అధ్యక్షులు మోరబోయిన బాబూరావు, ఉడుముల పిచ్చిరెడ్డి, జవ్వాజి రామాం జనేయరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యుడు పుచ్చమాల గోపినాథ్‌ చౌదరి,నాయకులు సాదం పిచ్చయ్య, వేంపాటి శ్రీకాంత్‌రెడ్డి, ఆయాగ్రా మాల రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T04:14:13+05:30 IST