
అమరావతి: రాష్ట్రంలో వికేంద్రీకరణ అభివృద్ధి దేవుడెరుగు, వికేంద్రీకరణ అత్యాచార అరాచకాలకు నిలయం అవడం భాధాకరమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఒక నెలలో మహిళలపై డజన్ల కొద్ది దుర్ఘటనలు నమోదు కావడం రాష్ట్రానికి అశుభం అన్నారు. ఒక కేసులో వేగవంతంగా పురోభివృద్ధి చూపి శిక్ష పడిందంటే ఉపయోగం లేదన్నారు. సామాజిక పరివర్తన కోసం ప్రయత్నం అవసరమని లంకా దినకర్ అన్నారు.
ఇవి కూడా చదవండి