
అమరావతి: టీటీడీ పాలకవర్గంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆదాయ వనరు కాదని, ఆధ్యాత్మిక కేంద్రమని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం క్యూలో మహాద్వారం వద్ద భక్తులు ధర్నా చేసే పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. కోటిన్నర, కోటికి ఉదయాస్తమయ సేవలంటు భక్తుల బలహీనతని సొమ్ము చేసుకునే పనిలో టీటీడీ పాలక వర్గం మునిగిపోయిందని ఆరోపించారు. వీఐపీ దర్శనాలు, ధనవంతుల సేవలకి పరిమితమైన టీటీడీ పాలక వర్గం నిర్లక్యంగా భక్తులను ఇక్కట్లకు గురిచేస్తోందని లంకా దినకర్ ఆరోపించారు.