
విజయవాడ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం శుభపరిణామమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ, నాబార్డు వంటి మిగతా సంస్థలు కూడా తమ కార్యాలయాలు అమరావతిలో నిర్మాణాలను త్వరలో ప్రారంభం చేయాలని లేఖ రాస్తామన్నారు. కేంద్ర మంత్రి అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. ఇక మూడు రాజధానుల నాటకానికి జగన్ ప్రభుత్వం తెరదించాలన్నారు.
ప్రభుత్వం అనేది నిరంతర కార్యనిర్వాహక ప్రక్రియని, ప్రజలపైన ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోకూడదని, అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేసే ప్రయత్నం చేయడం అవివేకమని లంకా దినకర్ అన్నారు.