లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో రెండో చార్జిషీటు

Published: Sat, 22 Jan 2022 02:31:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon

న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో పోలీసులు రెండో చార్జిషీటు దాఖలు చేశారు. నిరుడు అక్టోబరు 3న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేస్తున్న రైతులపై నుంచి మూడు కార్లు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ కారు డ్రైవరును రైతులు కొట్టి చంపారు. దీంతో ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తాజాగా దాఖలు చేసిన చార్జిషీటులో ఆ రైతుల పేర్లను చేర్చారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.