పాలనలో పారదర్శకతకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-04-12T05:05:10+05:30 IST

పాలనలో మరిం త పారదర్శకత పెంపొందించి జవాబుదారీతనంతో వ్యవహ రించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినట్లు నాగర్‌కర్నూ ల్‌ జిల్లా కలెక్టర్‌ లావుడ్య పి.శర్మన్‌ స్పష్టం చేశారు.

పాలనలో పారదర్శకతకు పెద్దపీట
ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శర్మన్‌

- అవినీతికి ఆస్కారమిస్తే ఇంటికే

- పాలనా యంత్రాంగానికి కలెక్టర్‌ హెచ్చరిక

- మేలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ పూర్తికి ప్రత్యేక కార్యాచరణ

- 15 రోజుల్లోగా ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం

- ఆంధ్రజ్యోతితో నాగర్‌కర్నూల్‌  కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పాలనలో మరిం త పారదర్శకత పెంపొందించి జవాబుదారీతనంతో వ్యవహ రించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినట్లు నాగర్‌కర్నూ ల్‌ జిల్లా కలెక్టర్‌ లావుడ్య పి.శర్మన్‌ స్పష్టం చేశారు. జిల్లా సమ గ్రాభివృద్ధికి దోహదపడుతున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి పథకాలను సత్వ రం పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసర మైన భూసేకరణను మేలోగా పూర్తి చేసి పనుల్లో వేగం పుం జుకునేలా చేస్తామని అన్నారు. 8నెలల క్రితం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎల్‌పీ.శర్మన్‌ ఇప్పటి వరకు మార్నింగ్‌ వాక్‌ పేరిట 200గ్రామాలను సందర్శించారు. గతంలో నాగర్‌ కర్నూల్‌ ఆర్డీవోగా పని చేసిన అనుభవంతో జిల్లా స మగ్రాభి వృద్ధికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించిన ఆయన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి అంశంలో రూపొందించిన కార్యాచరణ ఆయన మాటల్లోనే...

  మే నాటికి భూసేకరణ పూర్తి

 వలసల ప్రాంతంగా పేరున్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మ హాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకున్న త ర్వాత సమగ్ర స్వరూపం మారిపోయింది. వెనకబడిన నాగర్‌క ర్నూల్‌ జిల్లా పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకంతో తెలంగాణలోనే అగ్రగ్రామిగా నిలవబోతున్నది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణను ఈ ఏడాది మేలోగా పూర్తి చేయాలని సంక ల్పించాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో స్టేజ్‌- 1, 2లలో భూసేకరణకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమే. ఎల్లూరు, కుడికిళ్ల ప్రాంతాల్లో గతంలో క ల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన వారు రెండవసారి నిర్వాసితులుగా మారుతుండడంతో సమస్యలు త లెత్తుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కొందరు త్యా గాలు చేస్తేనే వందలు, వేల మందికి ప్రయోజనం చేకూరు తుందనే విషయాన్ని నిర్వాసితులకు తెలియజేస్తున్నాం. పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గ్రావిటీ కెనాల్‌లో 230 ఎకరాల మామిడి తోటలున్నాయి. నష్టపరిహారమందించి మేలోగా భూసేకరణను పూర్తి చేయాలని నిర్ణయించాం. 

 రూర్బన్‌ పథకం కింద మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌

వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనేది ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా జిల్లాలో ప్రయత్నాలు మొదలుపెట్టాం. కొల్లాపూర్‌ మామిడికి దేశవిదేశాల్లో బ్రహ్మాండమైన డిమాండ్‌ ఉంది. అయితే సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక రైతులు నష్ట పోతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కొల్లాపూర్‌ నియో జకవర్గంలో రెండు మామిడి ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చింది. ఈ క్రమంలో రూర్బన్‌ పథకం కింద పెద్దకొత్తపల్లి మండలంలో మామిడి ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.  

 ప్రజావాణి వినతులకు 15 రోజుల్లో పరిష్కారం

సామాన్య ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ యంత్రాంగానికి నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చిన వినతులను, దరఖా స్తులను స్వీకరిస్తున్నాం. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించిన అంశాలు తప్ప మిగతావన్నీ 15రోజుల్లోగా పరి ష్కరించాలని అన్ని శాఖలకు చెందిన అధికారులకు ఆదేశించ డం జరిగింది. 

 ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట

దాదాపు ఏడాదిన్నర నుంచి జిల్లాలో కరోనా కారణంగా ప్ర జలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కార్యాచర ణ రూపొందించాం. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మ రం చేశాం. ఆదివారం నాటికి జిల్లాలో 37,026మందికి వ్యాక్సినేషన్‌ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై అపో హలు తొలగించడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం.  

అవినీతికి ఆస్కారమిస్తే ఇంటికే..

సరళమైన విధానాలతో ప్రజలందరికీ మేలు చేకూర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్నమైన కార్యక్రమా లను అమలు చేస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూ సంబంధమైన వ్యవహారాల్లో వారిని మోసగించి ఆర్థికంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే పాలన యంత్రాంగం లో ఎవర్ని ఊపేక్షించేది లేదు.  

 చెంచుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

ఆదివాసీలైన చెంచుల సంక్షేమానికి ఇతోధిక ప్రాధాన్యతని స్తున్నాం. చెంచు పెంటల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవ స్థను మెరుగుపర్చడంతోపాటు వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు చొరవ తీసుకుంటున్నాం. త్వరలోనే చెంచుల సంక్షేమంపై సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం.  


Updated Date - 2021-04-12T05:05:10+05:30 IST