లష్కర్‌ వారానికి తరలివచ్చిన భక్తులు

ABN , First Publish Date - 2022-01-23T04:30:23+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నిర్వహించనున్న లష్కర్‌వారానికి లష్కర్‌భక్తులు శనివారం రాత్రి అధికసంఖ్యలో తరలివచ్చారు.

లష్కర్‌ వారానికి తరలివచ్చిన భక్తులు

చేర్యాల, జనవరి 22: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నిర్వహించనున్న లష్కర్‌వారానికి లష్కర్‌భక్తులు శనివారం రాత్రి అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ధూళిదర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. నేడు ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మల్లన్నకు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకోనున్నారు.  

Updated Date - 2022-01-23T04:30:23+05:30 IST