గుజరాత్‌కు భారీ టార్గెట్ నిర్దేశించిన పంజాబ్

Published: Fri, 08 Apr 2022 21:42:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గుజరాత్‌కు భారీ టార్గెట్ నిర్దేశించిన పంజాబ్

ముంబై: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది.  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి ప్రత్యర్థి ఢిల్లీకి 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లియామ్ లివింగ్ స్టోన్ వీర బాదుడుకు తోడు జితేశ్ శర్మ మెరవడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. లివింగ్ స్టోన్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.


మరోవైపు, లివింగ్‌స్టోన్ అండగా జితేశ్ శర్మ కూడా చెలరేగిపోయాడు. 11 బంతులు ఆడి ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు సాధించి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన ఓడియన్ స్మిత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇంకోవైపు, అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత 5 బంతులు మాత్రమే ఆడిన లివింగ్ స్టోన్ మొత్తంగా 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. జితేశ్, లివింగ్ స్టోన్ ఉన్నప్పుడు పరుగులు తీసిన స్కోరు ఆ తర్వాత నెమ్మదించింది.


షారూఖ్ ఖాన్ (15), రబడ (1) వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. అయితే, చివర్లో రాహుల్ చాహర్ కాస్త నిలదొక్కుకుని స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు (నాటౌట్) చేయడంతో స్కోరు మళ్లీ పుంజుకుని 189 పరుగుల వద్ద ఆగింది. శిఖర్ ధవన్ 35 పరుగులు చేయగా, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) మరోమారు దారుణంగా నిరాశ పరిచాడు. రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్‌కండే 2 వికెట్లు తీసుకోగా, షమీ, పాండ్యా, ఫెర్గ్యూసన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.