VISAKHA IMUలో లేటరల్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-06-27T22:25:34+05:30 IST

విశాఖపట్నంలోని ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ(ఐఎంయూ) - బీటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజనీరింగ్‌) ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామన్‌ ఎంట్రెన్స్‌

VISAKHA IMUలో లేటరల్‌ ఎంట్రీ

విశాఖపట్నంలోని ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ(ఐఎంయూ) - బీటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజనీరింగ్‌) ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) ద్వారా రెండో ఏడాది ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం నాలుగు సీట్లు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొన్న దరఖాస్తు ఫారాన్ని నింపి నిర్దేశిత ధ్రువపత్రాలు జతచేసి ఆర్డినరీ/ స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా కింది చిరునామాకు పంపాలి. వెబ్‌సైట్‌లో ఇచ్చిన గూగుల్‌ లింక్‌ ద్వారా దరఖాస్తు ఫారాన్ని అప్‌లోడ్‌ చేయాలి.

అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ షిప్‌ బిల్డింగ్‌ టెక్నాలజీ(ఐఎస్‌బీటీ) నుంచి నాలుగేళ్ల డిప్లొమా ఇన్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌) ఉత్తీర్ణులు; చెన్నైలోని ఏఎంఈటీ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల డిప్లొమా(నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. డిప్లొమా స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు; పదోతరగతి/ ఇంటర్‌ స్థాయిలో ఇంగ్లీష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ప్రోగ్రామ్‌ ప్రారంభం నాటికి పురుషులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు; మహిళలకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌: పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంజనీరింగ్‌ డ్రాయింగ్‌, మేథమెటిక్స్‌, అప్లయిడ్‌ మెకానిక్స్‌, ఇంజనీరింగ్‌ మెటీరియల్స్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, వర్క్‌షాప్‌ టెక్నాలజీ, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషిన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ కెమిస్ట్రీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.   


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 5

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 17న 

చిరునామా: డైరెక్టర్‌, ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ, వంగలి గ్రామం, సబ్బవరం మండలం, విశాఖపట్నం - 531035.

వెబ్‌సైట్‌: www.imuv.edu.in



Updated Date - 2022-06-27T22:25:34+05:30 IST