నెల్లూరు-చెన్నై మధ్య నిలిచిపోయిన రాకపోకలు

ABN , First Publish Date - 2020-11-27T03:49:07+05:30 IST

‘నివర్’ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే...

నెల్లూరు-చెన్నై మధ్య నిలిచిపోయిన రాకపోకలు

నెల్లూరు: ‘నివర్’ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గూడూరు వద్ద కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 40 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


ఇక చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలతో గంగినేని చెరువు ఉప్పొంగుతోంది. చెన్నారెడ్డి కాలనీని గంగినేని చెరువు వంక ముంచెత్తింది. దీంతో.. సబ్ రిజిస్ట్రార్ సహా 34 మంది కాలనీ వాసులు నీటిలో చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 2 గంటల పాటు శ్రమించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

Updated Date - 2020-11-27T03:49:07+05:30 IST