బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న మోక్షజ్ఞ చిత్రాన్ని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారని, ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా ఫైనల్ అయ్యాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞని పరిచయం చేసే డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాధ్కే బాలయ్య తనయుడిని కూడా పరిచయం చేసే అవకాశం లభించిందని, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న 'లైగర్' తర్వాత పూరీ ఈ చిత్రమే చేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం పూరీ ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారని, బాలయ్య కూడా స్టోరీ ఓకే చేశారని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రమే పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనుందని, చాలా గ్రాండ్గా మోక్షజ్ఞ ఎంట్రీని బాలయ్య ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలపై బాలయ్య, పూరి ఎలా స్పందిస్తారో చూద్దాం.