పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో Shocking Twist.. మిస్టరీ ఇలా వీడింది..

ABN , First Publish Date - 2022-05-23T16:00:39+05:30 IST

పెళ్లి పీటలపై వధువు సృజన మృతి (Death) చెందిన ఘటన విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో Shocking Twist.. మిస్టరీ ఇలా వీడింది..

విశాఖపట్నం : పెళ్లి పీటలపై వధువు సృజన మృతి (Death) చెందిన ఘటన విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. అసలేం జరిగింది..? వధువు విషం తాగిందా.. లేకుంటే ఆరోగ్య సమస్యలా..? ఇంత సడన్‌గా ఏం జరిగింది..? ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఇలా జరగడంతో అందరూ ఒకింత షాకయ్యారు. అయితే ఇప్పటి వరకూ అటు వధువు కుటుంబీకులు.. ఇటు వరుడు కుటుంబీకులు ఇరువురూ స్పందించినప్పటికీ అన్నీ ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు.. కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా అసలేం జరిగిందనే దానిపై కాల్ రికార్డ్స్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.


ఎవరా ప్రియుడు.. చాటింగ్‌లో ఏముంది..!?

పరవాడకు చెందిన తోకాడ మోహన్-సృజన ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను అడుగుదాం లేకుంటే.. బయటికెళ్లి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడల్లా తనకు సరైన ఉద్యోగం లేదని కొంత సమయం కావాలని సృజనకు చెప్పేవాడు. అయితే ఇంతలోనే సృజనకు.. శివాజీతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌పై సృజన మరింత ఒత్తిడి పెంచింది. తనను ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవాలని ప్రియుడిని కోరింది. తన కోసం రెండేళ్లు ఆగాలని ఇదే లాస్ట్ ఛాన్స్ అని సృజనను ప్రియుడు కోరాడు. అంతేకాదు ఈ పెళ్లి కూడా చేసుకోవడానికి వీల్లేదని.. పెళ్లి ఆపేస్తానని తనకు హామీ కూడా ఇవ్వాలని ప్రియుడు కోరాడు.


ఇదీ అసలు కథ..!

ఒక్కసారిగా పెళ్లిపీటలపై వధువు (Bride) కుప్పకూలడంతో ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సృజన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు కాల్ రికార్డ్స్ (Call Records) నిశితంగా పరిశీలించగా అసలు విషయాలన్నీ బయటికొచ్చేశాయి. పెళ్లి ఆపాలనే పక్కా ప్లాన్‌తోనే వధువు ఇలా చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు.. సృజన ఓ యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి  కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి అపాలనుకొనే ప్రయత్నంలోనే సృజన ఇలా ప్రాణాలు తీసుకుందని తేటతెల్లమైంది. ఆత్మహత్యకు ప్రేమ (Love) వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చేశారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో (Lover) ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) చాటింగ్ కూడా చేసిందని పోలీసులు చెబుతున్నారు. అందులో పెళ్లి ఆపేందుకు తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానని ప్రియుడికి హామీ ఇచ్చింది. సృజన అనుకున్నట్లుగానే పెళ్లి (Marriage) పీటలపైనే కుప్పకూలిపోయిందని కాల్ రికార్డ్స్‌తో స్పష్టమైంది.


ఇదంతా ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్‌లో ఉండటం గమనార్హం. ఒక్క ఇన్‌స్టాలోనే కాదు.. వాట్సాప్‌లో కూడా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు.. ఆ తర్వాత ఎవరికీ తెలియకూడదని డిలీట్ కూడా చేసేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే చివరగా పెళ్లి ఆపేస్తానని సృజన.. ప్రియుడికి మాటిచ్చిందని ఛాటింగ్ ద్వారా తెలిసింది. అయితే పెళ్లి ఆపాలని మాత్రమే వాళ్ల ప్లాన్ కానీ.. అనుకోకుండా చావుదాకా వెళ్లింది. ఇక ఇంట్లో వాళ్లను ఎదిరించలేనని సృజన అనుకున్నదో ఏమో కానీ చివరికి విషం తాగింది. పెళ్లి పీటలపై కూర్చునే కొన్ని నిమిషాల ముందు విషం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.. దీంతో సృజన ఒక్కసారిగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయి మృతి చెందింది. కాగా మొదట్నుంచీ ఆస్పత్రి డాక్టర్లు.. సృజన విషం తాగిందనే చెబుతున్నారు.. చివరికీ అదే నిజమైంది కూడా. మొత్తానికి చూస్తే.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మిస్టరీ కేసును పోలీసులు ఇలా ఛేదించారు.

Updated Date - 2022-05-23T16:00:39+05:30 IST