విమాన ప్రమాదంలో Latin Artist ఫ్లో లా మృతి

ABN , First Publish Date - 2021-12-16T13:36:12+05:30 IST

డొమినికన్ రిపబ్లిక్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో లాటిన్ ఆర్టిస్ట్ ఫ్లో లా మరణించారు...

విమాన ప్రమాదంలో Latin Artist ఫ్లో లా మృతి

లాస్‌ఏంజెల్స్: డొమినికన్ రిపబ్లిక్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో లాటిన్ ఆర్టిస్ట్ ఫ్లో లా మరణించారు.డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కూలిపోవడంతో ప్యూర్టో‌ రికన్ సంగీత నిర్మాత ఫ్లో లా మూవీ మరణించడంతో విషాదం అలముకుంది.ప్యూర్టో రికన్ సంగీత నిర్మాత ఫ్లో లా మూవీతో సహా మొత్తం తొమ్మిది మంది వ్యక్తులు మరణించారని ఎయిర్‌లైన్ తెలిపింది.లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో క్రాష్ అయిన విమానం ఇద్దరు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులతో మియామికి బయలుదేరిందని, వారిలో ఒకరు డొమినికన్ దేశస్థుడని, మిగిలినవారు ఇతర దేశస్థులు అని విమానం ఆపరేటర్ అయిన హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది.


‘‘ఈ విమాన ప్రమాదం మాకు చాలా బాధ కలిగిస్తుంది,విమాన ప్రమాదానికి కారణాన్ని గుర్తించలేదు’’అని హెలిడోసా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.హెలిడోసా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో జోస్ ఏంజెల్ హెర్నాండెజ్, డెబ్బీ వాన్ మేరీ జిమెనెజ్ గార్సియా ఉన్నారు.హెర్నాండెజ్ ఫ్లో లా మూవీగా సంగీతాన్ని అందించారు. 


Updated Date - 2021-12-16T13:36:12+05:30 IST