ఆలేరు మునిసిపల్‌ కమిషనర్‌గా లావణ్య లత

ABN , First Publish Date - 2021-04-23T06:40:19+05:30 IST

ఆలేరు మునిసిపల్‌ కమిషన ర్‌గా జి.లావణ్యలత గురు వారం బాధ్యతలు స్వీకరిం చారు. హైదరాబాద్‌ లోని సెక్రటేరియట్‌లో సెక్షన్‌ అధికా రిగా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఆలేరుకు వ చ్చారు.

ఆలేరు మునిసిపల్‌ కమిషనర్‌గా లావణ్య లత
కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలుపున్న చైర్మన్‌ శంకరయ్య

 ఆలేరు రూరల్‌, ఏప్రిల్‌ 22: ఆలేరు మునిసిపల్‌ కమిషన ర్‌గా జి.లావణ్యలత గురు వారం బాధ్యతలు స్వీకరిం చారు. హైదరాబాద్‌ లోని సెక్రటేరియట్‌లో సెక్షన్‌ అధికా రిగా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఆలేరుకు వ చ్చారు. ఇక్కడ విధులు నిర్వహి స్తున్న కమిషనర్‌ నాగేంద్రబాబు కోదాడకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో లావణ్యలత విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్‌ పి.సుమిత, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజు, బిల్‌కలెక్టర్‌ స్వామి, నాగేందర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T06:40:19+05:30 IST