శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి.. మీడియానే తప్పుడు ప్రచారం చేస్తోంది: మమతా

ABN , First Publish Date - 2022-04-27T22:22:49+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. కానీ కొన్ని వర్గాలకు చెందిన మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మా రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే కేసు నమోదు అవుతుంది..

శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి.. మీడియానే తప్పుడు ప్రచారం చేస్తోంది: మమతా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, అయితే కొన్ని వర్గాలకు చెందిన మీడియా ఉద్దేశపూర్వకంగా అవి బాగాలేనట్టు చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో అధికార విపక్ష పార్టీల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో అల్లర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఘటనలపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె స్పందిస్తూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. కానీ కొన్ని వర్గాలకు చెందిన మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మా రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే కేసు నమోదు అవుతుంది. కానీ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఫిర్యాదుకు కూడా అనుమతి లేదు. మీరు గమనించారో లేదో.. ఆ రాష్ట్రాల్లో జర్నలిస్టులను కనీసం వార్తైనా రాయనివ్వరు. రాస్తే వారిని బట్టలు విప్పి హింసిస్తారు. కానీ మా రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2022-04-27T22:22:49+05:30 IST