Viral Video: Court ప్రాంగణంలో వెంటాడి మరీ మహిళపై దాడి చేసిన లాయర్

Published: Sun, 08 May 2022 18:37:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: Court ప్రాంగణంలో వెంటాడి మరీ మహిళపై దాడి చేసిన లాయర్

ఇంటర్నెట్ డెస్క్: మహిళ తీరుతో విసిగిపోయిన ఓ న్యాయవాది వెంటాడి మరీ ఆమెపై దాడి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు.. సదరు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలకు చెందిన భారతి పటేల్ అనే మహిళ కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలోనే భర్త నుంచి భరణం కోరుతూ భారతి పటేల్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ నిమిత్తం భార్యభర్తలు ఇద్దరూ కోర్టుకు వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం సందర్భంగా భారతి పటేల్ వైఖరిపట్ల భర్త తరఫు లాయర్ భగవాన్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆమెపై దాడికి దిగాడు. కోర్టు ప్రాంగణంలో వెంటాడి మరీ ఆమెను కొట్టాడు. ఈ క్రమంలో కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తనపై దాడి చేసిన లాయర్‌పై భారతి పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.