విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న బార్ అసోసియేషన్ న్యాయవాదులు
చోడవరం, జూలై 5: కాకినాడలో విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది కళా వెంకటరావుని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనకు నిరసనగా మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. సమాజంలోన్యాయవాదుల పట్ల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోవడం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రకాశరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో న్యాయవాదులు ఉగ్గిన వెంకటరావు, గూనూరు లక్ష్మీనారాయణ, కొల్లి శ్రీనివాసరావు, హెచ్. శ్రీను, బర్ల గణేష్, కేఎల్‌ఆర్ లక్ష్మణరావు, ఆర్‌ఎస్ ప్రసాదనాయుడు తదితరులు పాల్గొన్నారు.