Advertisement

అక్షయ్ కుమార్ చెప్పిన ‘లక్ష్మీ బాంబ్’ అనుభవాలివే

Jun 29 2020 @ 21:23PM

ఈ సంవత్సరం విడుదల కాబోతోన్న చిత్రాలలో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన చిత్రంగా అక్షయ్ కుమార్ హర్రర్ కామెడీ ఫిల్మ్ ‘లక్ష్మీ బాంబ్’ కూడా చెప్పబడుతుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం మే 22నే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుంది. సోమవారం సాయంత్రం డిస్నీ + హాట్‌స్టార్ యొక్క ప్రత్యక్ష కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేస్తూ, అక్షయ్ కుమార్ చిత్రానికి చెందిన రెండు పోస్టర్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఈ చిత్రంతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘లక్ష్మీ బాంబ్‌లో నేను చేసింది మానసికంగా ఉద్వేగభరితమైన పాత్ర. ఇటువంటి పాత్ర నేను ఇంతకు ముందెన్నడూ చేయలేదు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ సీన్ కోసం నేను చాలా రీటేక్‌లు తీసుకున్న పాత్ర కూడా ఇదే. ఈ చిత్రంలో దర్శకుడు రాఘవ లారెన్స్ నాకు కొత్తదనాన్ని అనుభవించే అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రను నాతో చేయించిన ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు తెలియని ఒక సంస్కరణకు నన్ను రాఘవ పరిచయం చేశాడు. ఈ పాత్ర నేను ఇప్పటివరకు పోషించిన అన్ని పాత్రల కంటే భిన్నంగా ఉంటుంది. 150 సినిమాలు చేసిన తర్వాత కూడా, ప్రతిరోజూ సెట్‌లో ఉండటానికి, నా లక్ష్యాన్ని అందుకోవడానికి, నా గురించి మరింత తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాను. ఈ చిత్రం మనుషుల్లో విభేదాలపై మరింత అవగాహనను నాకు నేర్పింది. మీకు కావాల్సిన దాని కోసం.. అజ్ఞానంగా, మూర్ఖంగా పొందాలని ప్రయత్నించవద్దు. దయ శాంతికి కీలకం అని తెలుసుకోండి” అని తెలిపారు.



Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.