రామాలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-06-25T05:40:41+05:30 IST

మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో ప్రాచీన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పున:నిర్మాణానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు.

రామాలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న కందాళ

కూసుమంచి, జూన్‌ 24: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో ప్రాచీన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పున:నిర్మాణానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. దశాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం శిఽథిలావస్ధలలోకి చేరడంతో నూతన ఆలయ నిర్మాణానికి డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, జడ్పీటీసీ సభ్యురాలు బేబి దంపతులు రూ.50లక్షలు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణోతు శ్రీనివాస్‌, రూరల్‌, కూసుమంచి మండలపార్టీ అధ్యక్షులు బెల్లంవేణు, వేముల వీరయ్య, సర్పంచి కొండ సత్యం, ఎంపీటీసీ సభ్యురాలు అంబాల ఉమ, మాజీసర్పంచి ఐతగాని రామకోటి, ఆలయ అర్చకులు స్వామినాధ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా బోడియాతండాలో రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి రూ.5లక్షలు నిర్వహకులకు అందజేశారు. లాల్‌సింగ్‌తండాలో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ నిర్మానానికి భూమిపూజ నిర్వహించారు.  

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి 

తిరుమలాయపాలెం: గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని  ఎమ్మెల్యే కందాల అన్నారు. శుక్ర వారం మండ లంలోని చంద్రుతండాలో బోడా మంగ్త్యా నాయక్‌ జ్ఞాప కార్ధంఏర్పాటు చేసిన కల్యాణమండపాన్ని ప్రారంభించారు.


Updated Date - 2022-06-25T05:40:41+05:30 IST