లేఅవుట్‌ మారింది..

ABN , First Publish Date - 2021-06-23T05:38:09+05:30 IST

నరసరావుపేట పట్టణంలోని పేదల ఇళ్లస్థలాల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను మార్చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేయడంతో సమ స్యలు తలెత్తాయి.

లేఅవుట్‌ మారింది..
ప్లాట్‌ల కోసం ఏర్పాటు చేసిన రాళ్ళు తొలగింపు

నిబంధనలకు విరుద్ధంగా   ఇళ్ల స్థలాల ప్లాన్‌

అంగీకరించని ప్రభుత్వం

లేఅవుట్‌ మారిస్తే 5,137  ప్లాట్‌లకే ఉన్న స్థలం 

మరో 869 ప్లాట్ల కోసం  25 ఎకరాలు సేకరించాలి

పాత లేఅవుట్‌ రోడ్లకు  వెచ్చించిన నిధులు వృధా


నరసరావుపేట, జూన్‌ 22: నరసరావుపేట పట్టణంలోని పేదల ఇళ్లస్థలాల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను మార్చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేయడంతో సమ స్యలు తలెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన స్థలం కొలతలను   ప్రభు త్వం సూచించింది. ఇం దుకు విరుద్ధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. దీనిని ప్రభుత్వం అంగీ రించలేదు. తక్షణమే లే అవుట్‌ను మార్చాలని అధికా రులను ప్రభుత్వం అదేశిం చింది. దీంతో వేసిన లే అవుట్‌ను తొలగించి తిరిగి ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం కొత్త లే అవుట్‌ను రూపొందిస్తున్నారు. పాత లేఅవుట్‌ కోసం వేసి న రోడ్లన్నీ మార్చాల్సిరావడం, హద్దురాళ్లు తొలగించడంతో ఇందుకు వెచ్చించిన నిధులు నిరుపయోగమయ్యాయి.

 పట్టణంలోని పేదల కోసం ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఇళ్ల స్థలాలను గుర్తించారు. 6,016 మంది లబ్ధిదారులకు స్థలాలను మంజూరు చేశారు. ఇందుకోసం 96 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఇప్పుడు లేఅవుట్‌ మారుస్తుండటంతో ప్లాట్ల సంఖ్య తగ్గిపోతోంది. మారుస్తున్న లేఅవుట్‌లో 5,137 ప్లాట్లు మాత్రమే వస్తున్నాయి. మరో 869 ప్లాట్‌లు వేసేందుకు మరో 25 నుంచి 30 ఎకరాలు అవసరం అవుతుందని గుర్తిం చారు. ఈ స్థల సేకరణ కోసం మునిసిపాలిటీ రెవెన్యూ శాఖకు ప్రతి పాదనలు పంపాల్సి ఉంది. పాత లేవుట్‌లో సామాజిక అవసరాల కోసం ఏర్పాటు చేయాల్సిన స్థలం కూడా కుదించారు. కొత్త లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం ప్రభుత్వం సూచించిన విధంగా స్థలాన్ని కూడా కేటాయించాలి. గతం లో 13 అడుగుల వెడల్పు, 33 అడుగుల పొడవుతో సెంటు స్థలం చొప్పున ప్లాట్‌లు వేశా రు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం 20/22 అడుగుల కొలతలతో సెంటు స్ధలం చొప్పున కొత్త లేఅవుట్‌ లో ప్లాట్‌లు ఏర్పాటు చేయా ల్సి ఉంది. అంతర్గత రోడ్లు 20 అడుగులు ఏర్పాటు చేయ నున్నారు. ప్లాట్‌లు వేస్తున్న ప్రాంతం పట్టణ మాస్టర్‌ ప్లాన్‌లో లేకపోవడంతో రోడ్లు 20 అడుగులు వేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఉంటే 30 అడుగులు రోడ్లు వేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులతో వారికి కేటాయించిన ప్లాట్‌ వద్ద జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. కొత్త లే అవుట్‌ను పూర్తి చేయాలంటే భూసేకరణ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. తొలుతే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్లాట్‌లు వేసి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు. భూసేకరణ చేయాల్సి ఉన్నట్టు తహ సీల్దార్‌ రమణ నాయక్‌ తెలిపారు. 


 

Updated Date - 2021-06-23T05:38:09+05:30 IST