Lb Nagarలో 110 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-29T17:39:45+05:30 IST

ఎల్బీనగర్ లో ఎస్.ఓ.టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్నారు. ఏవోబి నుంచి మహారాష్ట్ర

Lb Nagarలో 110 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్: ఎల్బీనగర్ లో ఎస్.ఓ.టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్నారు. ఏవోబి నుంచి మహారాష్ట్ర, నాగ్‎పూర్‎కు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్.ఓ.టి పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-29T17:39:45+05:30 IST