కర్షకలు కన్నెర్ర

ABN , First Publish Date - 2020-10-23T11:32:56+05:30 IST

అన్నదాతల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.. ఆరుతడి పం టలపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబా లను పోషించుకుంటున్న ఆ రైతులకు నియంత్రిత సాగు విధానం శాపంగా

కర్షకలు కన్నెర్ర

మక్కలు, సన్నాలకు మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

కామారెడ్డి పట్టణ శివారులో.. టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారి దిగ్బంధం

5గంటల పాటు ధర్నా.. కలెక్టరేట్‌కు వరకు భారీ ర్యాలీ 

కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతుల యత్నం

అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట

కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. పలువురు రైతులకు గాయాలు

మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నేతల డిమాండ్‌


కామారెడ్డి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి టౌన్‌: అన్నదాతల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.. ఆరుతడి పం టలపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబా లను పోషించుకుంటున్న ఆ రైతులకు నియంత్రిత సాగు విధానం శాపంగా మారింది.. ఆరుగాలం పండించిన పంట ల ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర కేటాయించక పోగా.. కనీసం కోనుగోలు చేయకపోవడంతో మొక్కజొన్న రైతుల క డుపుమండింది.. దీంతో భారీ వర్షాలకు తడిసిన మక్కలను రోడ్డుపై పోసి, కంకులను మెడలో వేసుకుని నిరసన గళం వినిపించారు. గురువారం కామారెడ్డి పట్టణ శివారులోని టే క్రియాల్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిని వేలాది మంది రైతులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్ర భుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మొక్క జొన్న, సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కోనుగోలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. సుమారు 5 గంటలపాటు జాతీయరహదారిపై భైఠాయించి ఆందోళన చేపట్టినా ఉన్న తాధికారులు రాకపోయేసరికి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివె ళ్లారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పో లీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసుల మద్య తో పులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిం ది. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలు కాగా మరి కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.


పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అన్నదాతలు

కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల నుంచే కాకుండా పొరుగు జిల్లా అయిన నిజామాబాద్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చారు. సుమారు 2 వేల మంది రైతులు అక్కడికి చేరుకుని రోడ్డుపై  భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ని నాదాలు చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి ప్ర భుత్వమే కొనుగోలు చేయాలని, భారీ వర్షాల కారణంగా ప ంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమా ండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన రైతులకు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రిత సా గు విధానం పేరుతో నిర్బంధ వ్యవసాయం చేయాలని ని బంధనలు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి జి ల్లాల పరిధిలో రైతులు ప్రతిఏటా వేల ఎకరాలలో మొక్కజొ న్న పంటను సాగు చేస్తుంటారని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మద్దతు ధర కేటాయించక పోవడం అన్యాయమన్నారు. టెక్రియాల్‌ చౌర స్తాలో జాతీయ రహదారిపై సుమారు 5 గంటల పాటు ఆటపాటలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.


కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

జాతీయ రహదారిపై వేలాది మంది రైతులు బైఠాయించి సుమారు 5గంటల పాటు ఆందోళన చేపట్టినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రాకపో వడంతో ఆగ్రహానికి గురైన రైతులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ కు తరలివెళ్లారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిం చగా పోలీసులు బారిగేడ్లతో వారిని అడ్డుకున్నారు. దీంతో రై తులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసు కోవడంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంద రు రైతులను, రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చే సి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొందరు రైతులు, రైతు సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు పోలీసులు నిర్బ ంధాన్ని ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ప రిస్థితి మరింత ఉద్రిక్తం గా మారింది. ఈ ఘటన లో పలువురు రైతులకు గా యాలు కాగా మరి కొందరు సంఘ టన స్థలం వద్దనే సొమ్మసిల్లి పడిపోయా రు. మొక్కజొన్న రైతు అయిన రాజు కాలుకు తీవ్ర గాయ మైంది. మరో ఇద్దరు రైతులు సైతం గాయాల పాలయ్యా రు. మరో వృద్ధ రైతు సొమ్మసిల్లి రహదారిపైనే పడిపోయా డు. దీంతో రైతులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్‌ వచ్చే వరకు ఆందోళనను విరమించబోమని కలె క్టరేట్‌ వద్ద బైఠాయించారు. కలెక్టర్‌ శరత్‌ స్థానికంగా లే కపోవడంతో కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌నాయక్‌కు డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.


భారీగా నిలిచిన వాహనాలు 

రైతులు పోలీసుల వ్యుహానికి వ్యతిరేకంగా టేక్రియాల్‌ చౌరస్తా వద్ద కాకుండా అర కిలో మీటర్‌ దూరంలో జాతీయ రహదారి నుంచి టెక్రియాల్‌కు వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో  జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపు లా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వాహ నాలను దారిమళ్లించి రామారెడ్డి మీదుగా సదాశివనగర్‌ సత్యపీర్ల దర్గ ప్రాంతం నుంచి జాతీయ రహదారివైపు మళ్లించారు. రైతుల ధర్నా నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. గురువారం తెల్లవారుజామునే జాతీయ రహదారికి టెక్రియాల్‌ చౌరస్తా వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, వివిధ మండలాల ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో పోలీసులు ముందస్తుగానే ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు.

Updated Date - 2020-10-23T11:32:56+05:30 IST