
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపేందుకు యూరోపియన్ యూనియన్ నేతలు ఆ దేశ రాజధాని నగరం కీవ్‌లో మంగళవారం పర్యటిస్తారు. పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా దేశాల నేతలు యూరోపియన్ యూనియన్ మిషన్‌పై ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఇదిలావుండగా రష్యన్ దళాలు కీవ్‌ను సమీపిస్తున్నాయి.
చెక్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి Petr Fiala ఇచ్చిన ట్వీట్లో ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నిర్ద్వంద్వంగా మద్దతిస్తున్నట్లు తెలియజేయడానికే తాము కీవ్‌లో పర్యటిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు మద్దతిస్తున్నట్లు తెలియజేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
Petr Fialaతోపాటు స్లోవాక్ ప్రధాన మంత్రి జనేజ్ జనా, పోలిష్ ప్రధాన మంత్రి Mateusz Morawiecki, పోలండ్ ఉప ప్రధాన మంత్రి జరోస్లా కషింస్కీ ఈ పర్యటనలో పాల్గొంటారని యూరోపియన్ యూనియన్ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మంగళవారం ఆ దేశ రాజధాని నగరం కీవ్ సమీపానికి రష్యన్ సేనలు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి