కౌలు.. గగ్గోలు

ABN , First Publish Date - 2021-06-21T05:15:17+05:30 IST

కౌలు రైతు గొల్లుమంటున్నాడు.. ఏటా పెరుగుతున్న కౌలు ధరలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నాడు..

కౌలు.. గగ్గోలు
నాయినోనిపల్లి వద్ద పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులు

- కౌలుదారుల కష్టాల సాగు

- పెరిగిన కౌలు ధరలతో ఇబ్బందులు

- ప్రభుత్వం నుంచి సహకారం కరువు

- రుణాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నపాలు

- పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వాలని వేడుకోలు


మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి : కౌలు రైతు గొల్లుమంటున్నాడు.. ఏటా పెరుగుతున్న కౌలు ధరలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నాడు.. సాగునీటి పథకాలు, బోరు బావుల కింద సేద్యానికి కొంత గ్యారంటీ ఉన్నా, మెట్టలో సాగు చేసే భూముల కౌలుదారులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.. కౌలు మొత్తం ముందస్తుగానే చెల్లించడం, విత్తనాలు, సాగు వ్యయం, పంట అమ్మేంత వరకు అన్ని ఖర్చులు సొంతంగానే భరిస్తున్నాడు.. అయితే, గత ప్రభుత్వాల హయాంలో 2012లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు కౌలు రైతులకు  స్వల్పంగా ఎకరాకు రూ.10 వేల మేర రుణ పరపతి ఉండేది.. ఆ తర్వాత ఈ పథకం రద్దైంది.. తాజాగా రైతుబంధు పథకం కేవలం భూ యజమానులకే వర్తిస్తుండగా, వ్యవసాయ రుణాలు, రుణమాఫీలు, పంట నష్ట పరిహారాలు కూడా వారికే దక్కుతున్నాయి.. ఈ నేపథ్యంలో కౌలు ధరలన్నా తగ్గించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మహత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తి పోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ), భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ప థకాల కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి పం టలు పండే భూములకు కౌలు గిరాకీ ఉంది. జూరాల ఆధారంగా ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల కింద విత్తన పత్తి పండించే భూములకు కౌలు గిరాకీ ఉంటోంది. వరి, పత్తి, మిరప, వేరశనగ సాగయ్యే భూములకు కౌలు ధరలు గరిష్ఠంగా ఎకరాకు రూ.20 వేలు ఉండగా, వర్షాధారంగా సాగయ్యే భూములకు అత్యల్పంగా ఎకరాకు రూ.5 వేలు కౌలు ధర ఉంది.


వరి భూములకు ఎకరాకు గరిష్ఠంగా 8 నుంచి 10 బస్తాల ధాన్యం

ఉమ్మడి జిల్లాలో దాదాపు 25 వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు తెలిసిం ది. జూరాల, ఎంజీకేఎల్‌ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ కాల్వల ద్వారా స మృద్ధిగా సాగునీరు అందుతుండటంతో, మూడేళ్లుగా వరి ఎక్కువగా సాగవుతోం ది. వరి పొలాలను కౌలుకు చేసే రైతులు గరిష్ఠంగా ఒక పంటకు ఎకరాకు ఎ నిమిది బస్తాల నుంచి పది బస్తాల ధాన్యాన్ని కౌలు కింద భూ యజమానులకు ఇస్తుండగా, కనిష్ఠంగా ఆరు బస్తాల ధాన్యం ఇస్తున్నారు. బోరు బావుల కింద  సాగ య్యే వరి పొలాలకు సైతం ఇదే కౌలును అందిస్తున్నారు. అలాగే ప్రాజెక్టులు, బోరు బావుల కింద కూడా ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నీటి వ సతి ఉన్న భూములకు పత్తి పండే చోట ఎకరాకు రూ.8 వేల కౌలు చెల్లిస్తుండగా, వ ర్షాధారంగా పత్తి పండించే కౌలు రైతులు ఎకరాకు రూ.5 వేల ధర చెల్లిస్తున్నా రు. నెట్టెంపాడు కింద జోగుళాంబ గద్వాల జిల్లాలోని బోరు బా వుల కింద విత్తన పత్తి సాగు చేసే భూములకు మాత్రం ఎకరాకు రూ.20 వేల కౌలు ధ ర పలుకుతోంది. ఆర్డీఎస్‌ కాల్వ కింద సాగు భూములలో శనగలు, మిరప, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలు పండించే కౌలు రైతులు ఎకరాకు రూ.12 వేల కౌలు ధర చెల్లిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంతో పోల్చుకుంటే కౌలు ధరలు స్వల్పంగా తగ్గినా, కౌలుకు పొలాలు చేసే వారు కూడా త గ్గిపోయారు. బోరు బావుల కింద సాగయ్యే పత్తి, కంది, మొక్కజొన్న ఇతర పంటలు సాగయ్యే భూములకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు చె ల్లిస్తున్నారు. ఎలాంటి సాగునీటి అవకాశాల్లేని మెట్ట భూముల్లో పత్తి, ఆముదం, మొ క్కజొన్న, జొన్న, కంది సాగు చేసే కౌలు రైతులు ఎకరాకు రూ.5 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు.


రుణాలు, పెట్టుబడులు అందించాలనే డిమాండ్‌

శ్రమనే నమ్ముకొని జీవించే కౌలు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలనే డి మాండ్‌ వస్తోంది. సాగు చేసే కౌలు రైతులను గుర్తించి పంట రుణాలందించాలని కో రుతున్నారు. పెట్టుబడి సాయం పథకాన్ని వాస్తవంగా పంట సాగు చేసే రైతులు భూ యజమానులైతే వారికి, కౌలు రైతులు సాగు చేస్తే కౌలుదారులకు ఇవ్వాలని కోరుతు న్నారు. కనీసం ఆమేర కౌలు ధరలైనా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పంట పండించిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఇబ్బందులతో పంటలు నష్టపోతే కౌలు రైతులకే పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-21T05:15:17+05:30 IST