`పాప మీ చేతుల్లో ఉంది.. కాపాడండి లేదా చంపెయ్యండి` అంటూ పరారైన తల్లిదండ్రులు..

ABN , First Publish Date - 2022-03-10T21:46:43+05:30 IST

పురుషులకు తామేం తక్కువ కాదంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్న ఈ రోజుల్లో కూడా వారి పట్ల వివక్ష తగ్గడం లేదు.

`పాప మీ చేతుల్లో ఉంది.. కాపాడండి లేదా చంపెయ్యండి` అంటూ పరారైన తల్లిదండ్రులు..

పురుషులకు తామేం తక్కువ కాదంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్న ఈ రోజుల్లో కూడా వారి పట్ల వివక్ష తగ్గడం లేదు. తమకు మగ బిడ్డే పుట్టాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆలోచన మారడం లేదు. తాజాగా రాజస్థాన్‌లో రోజుల వయసున్న ఓ ఆడ బిడ్డను తల్లిదండ్రులు శిశు సంక్షేమ భవనం వద్ద వదిలేసి చేతులు దులిపేసుకున్నారు. పెంచితే పెంచండి.. లేకపోతే చంపెయ్యండి అని చెప్పి తమ దారి తాము చూసుకున్నారు. 


జైసల్మేర్‌లోని శిశు సంక్షేమ గృహం వద్దకు బుధవారం రాత్రి రోజుల వయసున్న ఆడబిడ్డను పట్టుకుని ఓ మహిళ, ఓ వ్యక్తి బైక్‌పై వచ్చారు. తలుపు ముందు ఆ చిన్నారిని వదిలిపెట్టి.. `పెంచగలిగితే పెంచండి లేదా చంపండి..` అని చెప్పి వారు వారు వేగంగా వెళ్లిపోయారు. ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. బలహీనంగా ఉన్న ఆ చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ అమీన్ ఖాన్.. జవహర్ ఆసుపత్రిలో చేర్పించారు.


ప్రస్తుతం ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి నెల రోజుల ముందుగానే పుట్టినట్టు వైద్యులు భావిస్తున్నారు. చికిత్స అనంతరం ఆ చిన్నారిని బాలల సంక్షేమ గృహానికి తరలిస్తామని, ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటే వారికి అప్పగిస్తామని అమీన్ ఖాన్ తెలిపారు. 


Updated Date - 2022-03-10T21:46:43+05:30 IST