Viral News: కష్టపడి దాచుకున్న డబ్బుపై అధికారుల ఆంక్షలు.. తుపాకీ, పెట్రోల్‌తో బ్యాంకులోకి ఎంటరైన కస్టమర్.. చివరికి..

ABN , First Publish Date - 2022-08-12T22:56:48+05:30 IST

అవసరాలకు పనికొస్తుందని కదా అని.. అందరిలాగే అతడు కూడా కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని బ్యాంకులో దాచుకున్నాడు. ఇంతలో అతడికి అత్యవసర పరిస్థితి వచ్చింది. దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని విత్‌ డ్రా చేసుకోవడానికి బ్యాంకు‌కు వెళ్లాడు. అక్కడ అధికారులు చెప్పింది విని షాకయ్యాడు. తనకు అవ

Viral News: కష్టపడి దాచుకున్న డబ్బుపై అధికారుల ఆంక్షలు.. తుపాకీ, పెట్రోల్‌తో బ్యాంకులోకి ఎంటరైన కస్టమర్.. చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: అవసరాలకు పనికొస్తుందని కదా అని.. అందరిలాగే అతడు కూడా కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని బ్యాంకులో దాచుకున్నాడు. ఇంతలో అతడికి అత్యవసర పరిస్థితి వచ్చింది. దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని విత్‌ డ్రా చేసుకోవడానికి బ్యాంకు‌కు వెళ్లాడు. అక్కడ అధికారులు చెప్పింది విని షాకయ్యాడు. తనకు అవసరమైన డబ్బును ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ‘నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుపై మీ పెత్తనం ఏంటి’ అని ఆగ్రహంతో ఊగిపోతూ బ్యాంకు నుంచి బయటికొచ్చాడు. అనంతరం తుపాకీతోపాటు పెట్రోల్ బాటిల్‌తో బ్యాంకులోకి రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశాడు. ఈ క్రమంలో చివరికి ఏం జరిగింది? అసలు అతడు డబ్బును ఏ కారణంగా విత్‌డ్రా చేసుకోవాలనుకున్నాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బస్సామ్ అల్ షైక్ హుస్సైన్(Bassam al-Sheikh Hussein).. లెబనాన్(Lebanon) దేశస్థుడు. ప్రస్తుతం సుమారు 42ఏళ్ల వయస్సు ఉన్న ఈయన.. ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇలా పని చేయడం ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని అవసరాలకు పనికొస్తుందనే ఉద్దేశంతో.. రాజధాని బీరట్‌లో ఉన్న ఓ బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడి బ్యాంకు అకౌంట్లో(Bank Account) ఇప్పటి వరకు €204,000 (సుమారు రూ.1.62కోట్లు) జమయ్యాయి. ఇంతలో హుస్సైన్ తండ్రి అనారోగ్యానికి గురైంది. దీంతో తండ్రిని అతడు.. ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ నేపథ్యంలోనే హుస్సైన్ తన తండ్రి చికిత్సకు కావాల్సిన డబ్బులు విత్‌డ్రా (Money Withdrawal) చేయడానికి బ్యాంకు‌కు వెళ్లాడు. అక్కడ బ్యాంకు అధికారులు అతడికి షాకిచ్చారు. తను అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. తన పరిస్థితిని వివరించానా.. అధికారులు వినిపించుకోలేదు. 



ఈ నేపథ్యంలో అతడు ఆగ్రహానికి లోనై బ్యాంకు నుంచి బయటికొచ్చేశాడు. అనంతరం గురువారం రోజు తుపాకీ, పెట్రోల్ బాటిల్‌తో తిరిగి బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు కావాల్సినంత డబ్బు ఇవ్వకుంటే.. కాల్చేస్తానని బ్యాంకు అధికారులను బెదిరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం అంటూ హెచ్చరించాడు. విషయం తెలిసి.. పెద్ద ఎత్తున భద్రతాదళాలు అక్కడకు చేరుకుని బ్యాంకు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే.. బ్యాంకు అధికారులు అతడికి 35వేల డాలర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చివరికి శాంతించాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హుస్సైన్ బ్యాంకులో చేస్తున్న హడావిడి గురించి తెలిసి అతడి కుటుంబ సభ్యులతోపాటు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. హుస్సైన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌(Viral)గా మారాయి. 


డబ్బుపై ఆంక్షలకు కారణం ఇదే..

దాదాపు 2019 నుంచి లెబనాన్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యల నుంచి గట్టేందుకు.. అక్కడి ప్రభుత్వంతో కలిసి, ఫెడరల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో పౌరులు దాచుకున్న డబ్బు‌పై ఆంక్షలు విధించింది. నగదు విత్‌డ్రా‌పై పరిమితులు పెట్టింది. ఎంత పడితే అంత డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. 




Updated Date - 2022-08-12T22:56:48+05:30 IST