America లో జాబ్‌కు గుడ్‌బై.. లక్షల సంపాదించే ఛాన్స్ ఉన్నా ఈ 27 ఏళ్ల కుర్రాడు అన్నీ వదిలేసి..

ABN , First Publish Date - 2021-12-29T20:36:14+05:30 IST

అతను అమెరికాలోనే పుట్టి పెరిగాడు.. అక్కడే ఉన్నత చదువును అభ్యసించాడు..

America లో జాబ్‌కు గుడ్‌బై.. లక్షల సంపాదించే ఛాన్స్ ఉన్నా ఈ 27 ఏళ్ల కుర్రాడు అన్నీ వదిలేసి..

అతను అమెరికాలోనే పుట్టి పెరిగాడు.. అక్కడే ఉన్నత చదువును అభ్యసించాడు.. అనంతరం ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.. నెలకు లక్షలు సంపాదించేవాడు.. అయితే ఉన్నట్టుండి అతను ఆ ఉద్యోగం వదిలేసి భారత్‌కు వచ్చేశాడు.. కోట్ల ఆస్తిని వదులుకుని ఓ సన్యాసిగా మారిపోయాడు.. సామాజిక సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు.. గుజరాత్‌లోని సిరోహి జిల్లాలోని పిండ్వారా తెగకు చెందిన జైనమ్ జైన్ కథ ఇది. 


న్యూయార్క్‌లో భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టిన జైనమ్ జైన్ అక్కడే చదువుకున్నాడు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు లక్షల్లో జీతం. అయితే అవేవీ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో నాలుగేళ్ల క్రితం జాబ్ వదిలేసి అమెరికా నుంచి గుజరాత్ వచ్చేశాడు. సాలంగపూర్‌లో ఉన్న స్వామినారాయణ్ గురుకుల్‌లో చేరి నాలుగేళ్లుగా సామాజిక సేవకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాడు. 


`పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడితే నా ఒక్క కుటుంబమే బాగు పడుతుంది. సామాజిక సేవ చేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయ`ని జైనమ్ చెబుతున్నాడు. అతని నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. పిండ్వారా తెగకు చెందిన తమలో సామాజిక సేవ అనేది అంతర్లీనంగా ఉంటుందని జైనమ్ తండ్రి చెప్పారు. కాగా, జైనమ్ సోదరి షేనిక ప్రస్తుతం ఆమెరికన్ ఆర్మీలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెరికన్ ఆర్మీలో వైద్యురాలిగా సేవలందిస్తున్న తొలి భారతీయ మహిళగా షేనిక నిలిచారు.    

Updated Date - 2021-12-29T20:36:14+05:30 IST