లెఫ్ట్‌కెనాల్‌ గండి పూడ్చరూ..

ABN , First Publish Date - 2021-04-19T04:41:12+05:30 IST

సంగం బండ రిజర్వాయర్‌ హై లెవల్‌ ఎడమ కాల్వకు గండి పడి 9 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువు రు రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.

లెఫ్ట్‌కెనాల్‌ గండి పూడ్చరూ..
గండిపడ్డ సంగంబండ హైలెవల్‌ లెఫ్ట్‌ కెనాల్‌

మక్తల్‌, ఏప్రిల్‌ 18 : సంగం బండ రిజర్వాయర్‌ హై లెవల్‌ ఎడమ కాల్వకు గండి పడి 9 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువు రు రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. హైలెవల్‌ ఎడమ కా ల్వ ద్వారా నర్వ, మక్తల్‌, ఆత్మకూ ర్‌ మండలాల్లో సుమారు 30వేల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా నీరు అందిస్తుంది. కాల్వకు గండి పడ టంతో ఎద్దుల బండ్లు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారి 167 పక్కనే గండి పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ఈ గండిని పూడ్చివేయాలని కోరారు. 

Updated Date - 2021-04-19T04:41:12+05:30 IST