పెట్రో ధరల భారంపై వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2022-05-26T06:24:28+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ విద్యుత్‌ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బలరాం, సీఐటీయూ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరల భారంపై వామపక్షాల నిరసన
భీమవరంలో వామపక్షాల నిరసన ప్రదర్శన

భీమవరం అర్బన్‌ / తణుకు, మే 25:  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ విద్యుత్‌ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బలరాం, సీఐటీయూ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలు బంకు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అకలి రాము, యకోబు, పాల త్రిముర్తులు, వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. తణుకులో జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కా ర్యదర్శి కోనాల భీమారావు, బొద్దాని నాగరాజు, ప్రతాప్‌, కామన మునిస్వామి, దక్షిణమూర్తి, అజయకుమారి, మురళి తదితరులు పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో సీపీఐ అధ్వర్యంలో వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశా రు. అరేటి మృత్యుంజయ, క్రాంతికుమార్‌, భాస్కర్‌రావు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-26T06:24:28+05:30 IST