మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి

ABN , First Publish Date - 2021-11-30T04:58:39+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండిం చిన పంటలకు మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి
విలేకరులతో మాట్లాడుతున్న వేముల శ్రీనివాస్‌రెడ్డి

- కిసాన్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి



వనపర్తి టౌన్‌, నవంబరు 29: ఆరుగాలం కష్టపడి పండిం చిన పంటలకు మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని  కిసాన్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మద్దతు ధరకు చట్టం చేయాలన్నారు. రైతులు పండించిన పంటకు ఎంఎస్‌పీ ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన బా ధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వివిధ పంటల ఉత్పత్తి వ్యయానికి కేంద్రం ప్రకటించే మద్దతుకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు. కొన్నేళ్లు నుంచి రైతులు మొ త్తుకుంటున్నా సీఏసీపీ పట్టించుకోకపోవడంతో 70శాతం మందికి మద్దతు సంగతే తెలియక వ్యాపారులు, దళారులు ఆడిందే ఆటగా మార్కెట్‌లో చలామణి అవుతోందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలుపరిచి ప్రభు త్వం చట్టబద్ధత కల్పించినప్పుడే కష్టపడిన శ్రమకు గిట్టుబా టు దక్కుతుందన్నారు. సమావేశంలో ఎల్లంపల్లి నరేందర్‌ రెడ్డి, మేస్త్రీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T04:58:39+05:30 IST