ప్రఖ్యాత గాయని పి.సుశీల నోట బతుకమ్మ పాట..

ABN , First Publish Date - 2022-05-19T16:34:28+05:30 IST

ప్రఖ్యాత గాయని సుశీల నోట బతుకమ్మ పాట పాడితే వినాలని ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వెంటనే స్పందించిన...

ప్రఖ్యాత గాయని పి.సుశీల నోట బతుకమ్మ పాట..

  • ఆమె నా అభిమాన గాయని : కవిత 

హైదరాబాద్ సిటీ/రవీంద్రభారతి : ప్రఖ్యాత గాయని సుశీల (P Susheela) నోట బతుకమ్మ పాట పాడితే వినాలని ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కోరారు. వెంటనే స్పందించిన గాయని పి.సుశీల ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామ..’ అంటూ బతుకమ్మ పాట పాడుతూ ప్రేక్షకుల్ని అలరించారు. కవిత బతుకమ్మ (Bathukamma Song) పాట పాడుతూ సుశీలతో పాడించడం విశేషం. బుధవారం రవీంద్రభారతిలో (Ravindra Bharathi) ఆర్‌.ఆర్‌.ఫౌండేషన్‌, శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌, తిరుమల బ్యాంక్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ గాయని పి.సుశీలమ్మ 88 ఇయర్స్‌ పాటలు 70 ఇయర్స్‌ పేరిట సుశీల పాటల (Susheela Songs) ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సుశీలకు ఘన సత్కారం చేశారు.


‘గోదారి గట్టుంది..’ అంటూ పాడిన పాటకు ప్రేక్షకులు (Audience) కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఎండీ బండారు సుబ్బారావు, బొక్కా భీంరెడ్డి, చంద్రశేఖర్‌, వంశీరామరాజు, నీరజ్‌ లకోటియా, మహ్మద్‌ రఫీ, భోగరాజు, ఆమని పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆమని (Singer Amani) నేతృత్వంలో సీల్‌వెల్‌ తిరుమల బ్యాంక్‌ సినీ సుస్వరాలు శీర్షికన నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకుల్ని అలరించింది. పి.సుశీల పాటలతో గాయనీగాయకులు ఆకట్టుకున్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. సుశీలను సత్కరించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు ఇష్టమైన గాయకుల్లో (Singers) పి.సుశీల ముందు వరుసలో ఉంటారని అన్నారు. యూట్యూబ్‌ అందుబాటులో లేక ముందు ఆకాశవాణి సమయంలో పి.సుశీల పాటలు ప్రేక్షకులకు హాయినిచ్చేయని గుర్తు చేశారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి (Assembly Speaker) మాట్లాడుతూ తమ తరంలో ఘంటసాల, పి.సుశీల పాటలు వింటూ పెరిగామని తెలిపారు. అలనాటి పాటల మాధుర్యమే వేరని అన్నారు. ఈ సందర్భంగా సుశీల పలు భక్తి గీతాలు పాడి అలరించారు.

Updated Date - 2022-05-19T16:34:28+05:30 IST