T.News: దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు: Gutta

ABN , First Publish Date - 2022-07-21T15:47:06+05:30 IST

దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

T.News: దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు: Gutta

నల్గొండ: దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్(Legislative Council Chairman ) గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బాగున్నాయని పార్లమెంట్‌లో కితాబు ఇచ్చినా రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. కొర్రీలను పెడుతూ తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్నీ రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీ(Modi) ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు బతకడం కష్టంగా మారిందన్నారు. స్మశానవాటికలకు కూడా జీఎస్టీ పెడుతున్నారని... జీఎస్టీ(GST)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే ఎక్కువగా 100 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదని విమర్శించారు. సీబీఐ(CBI), ఈడీ(ED)లతో బెదిరింపులకు గురి చేస్తూ బీజేపీ(BJP) దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గుత్తాసుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-21T15:47:06+05:30 IST