లీజు హక్కుల వేలం

Jun 16 2021 @ 22:15PM
వేలం నిర్వహిస్తున్న డీఎల్‌పీవో, ఈవోపీఆర్‌డీ

స్వల్పంగా పెరిగిన ఆదాయం

కోట, జూన్‌ 16 : కోట పంచాయతీ పరిధిలోని దుకాణాల భవనాల లీజు హక్కులకు బుధవారం నిర్వహించిన వేలంలో గ్రామ పంచాయతీ ఆదాయం కొద్దిగానే పెరిగింది. కొత్తవారు వేలంలో పాల్గొనకుండా, పాత లీజుదారులు పావులు కదపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.   గత ఏడాది ఈ దుకాణాల ద్వారా పంచాయతీకి రూ.6 లక్షలు ఆదాయం లభించగా ఈ ఏడాది అది రూ.7 లక్షలకు పెరిగింది.  డీఎల్‌పీవో వెంకటరమణ,  ఈవోపీఆర్‌డీ స్వరూపారాణి,  సర్పంచ్‌ వెంకటరమణమ్మ, కార్యదర్శి నెలవల రాజశేఖర్‌ వేలం నిర్వహించారు. . 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.