Lenovo: లెనొవో నుంచి ఫ్యూచర్ జనరేషన్ ల్యాప్‌టాప్స్

ABN , First Publish Date - 2022-08-14T01:07:14+05:30 IST

చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ లెనొవో తాజాగా ఫ్యూచర్ జనరేషన్ క్రాప్టెడ్ యోగా సిరీస్‌లో భాగంగా లెజియన్,

Lenovo: లెనొవో నుంచి ఫ్యూచర్ జనరేషన్ ల్యాప్‌టాప్స్

న్యూఢిల్లీ: చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ లెనొవో తాజాగా ఫ్యూచర్ జనరేషన్ క్రాప్టెడ్ యోగా సిరీస్‌లో భాగంగా లెజియన్, ఐడియా ప్యాడ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ శ్రేణి ల్యాప్‌టాప్‌లో లెజియన్‌ 5ఐ, లెజియన్‌ 5ఐ ప్రో, లెజియన్‌ స్లిమ్‌ 7ఐ, ప్యాడ్‌ గేమింగ్‌ 3ఐతో పాటు యోగా 9ఐ, యోగా స్లిమ్‌ 7ఐ ప్రో, యోగా 7ఐ ఉన్నాయి. ఇవన్నీ ట్వెల్త్ జనరేషన్ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు, వేగవంతమైన గ్రాఫిక్స్‌, మెరుగై బ్యాటరీ పనితీరు కలిగినవే.  ఈ అల్ట్రా స్లిమ్‌, తేలికపాటి ల్యాప్‌టాప్‌లు ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే,  సౌకర్యవంతమైన ఎడ్జ్‌ డిజైన్‌, హ్యుమనైజింగ్‌ సాఫ్ట్‌ కాంటూర్స్‌తో సులభంగా తీసుకెళ్లేలా ఉన్నాయి.


 లెజియన్‌, ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు గేమింగ్‌ అనుభవాలను తీసుకువస్తాయి. ఇవి ఆధునిక గేమర్లు, ప్రొఫెషనల్‌ ప్లేయర్ల అవసరాలను తీర్చనున్నాయి.  ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ 3ఐ లో శక్తివంతమైన ప్రాసెసింగ్‌, గ్రాఫిక్స్‌ వంటివి ఔత్సాహిక గేమింగ్‌ శక్తి, మహోన్నతమైన స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉండటం వల్ల  మొదటిసారి గేమింగ్‌  ఆడేవారికి అత్యున్నత ఎంపికగా ఉంటుంది. వీటిలో ముందుగానే లోడ్‌ చేసిన  మూడు నెలల ఎక్స్‌బాక్స్‌ గేమ్స్‌ పాస్‌ ఉంది. లెనోవో లెజియన్‌ అల్టిమేట్‌ సపోర్ట్‌ (ఎల్‌యుఎస్‌) కూడా వినియోగదారులకు అందుబాటులో  ఉంది.   


ధరలు ఇలా..

లెనొవో యోగా 9ఐ, యోగా స్లిమ్‌ 7ఐ, యోగా 7ఐ లు ఓట్‌మీల్‌, స్ట్రామ్‌ గ్రే, స్లేట్‌ గ్రే రంగులలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా 1,69,990, రూ. 1,06, 990, రూ. 1,14,990 మాత్రమే. లెజియన్‌ 5ఐ, లెజియన్‌ 5ఐ ప్రో, లెజియన్‌ స్లిమ్‌ 7ఐ ధరలు వరుసగా రూ. 1,44,990, రూ. 1,64,990, రూ.1,50,990.  ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ 3ఐ రూ. 84,990కి సొంతం చేసుకోవచ్చు. యోగా, లెజియన్‌, ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు లెనొవో డాట్‌ కామ్‌, లెనొవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లలో  విజయవాడ, విశాఖపట్నం, కొచిన్‌, తిరుచిరాపల్లిలో లభ్యమవుతాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేసుకోవచ్చు.

Updated Date - 2022-08-14T01:07:14+05:30 IST