Leopard: ఇంట్లోకి వచ్చిన చిరుతపులి...షాక్

ABN , First Publish Date - 2022-10-07T15:10:32+05:30 IST

దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో(Durga idol immersion) పాల్గొనేందుకు కుటుంబసభ్యులంతా బయటకు వెళ్లడంతో ఆ ఇంట్లోకి చిరుతపులి(Leopard) వచ్చిన ఉదంతం...

Leopard: ఇంట్లోకి వచ్చిన చిరుతపులి...షాక్

పరుగులు తీసిన కుటుంబసభ్యులు

ముంబయి(మహారాష్ట్ర): దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో(Durga idol immersion) పాల్గొనేందుకు కుటుంబసభ్యులంతా బయటకు వెళ్లడంతో ఆ ఇంట్లోకి చిరుతపులి(Leopard) వచ్చిన ఉదంతం మహారాష్ట్రలోని ( Maharashtra)ముంబయి నగర పరిధిలోని సతారాలోని కోయానగర్ ప్రాంతంలో జరిగింది. సతారాలోని ఓ కుటుంబం గురువారం దుర్గా విగ్రహం నిమజ్జనానికి కుటుంబసభ్యులు వెళ్లిన సమయంలో ఇంట్లోకి(Koyanagar house) చిరుతపులి వచ్చింది.గురువారం రాత్రి తిరిగి వచ్చిన కుటుంబసభ్యులు ఇంట్లోని ఓ గది తలుపు వచ్చి కూర్చొని ఉన్న చిరుతపులిని చూసి షాక్‌కు గురయ్యారు.షాక్ నుంచి తేరుకున్న కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. (family ran)


ఇంట్లోకి చిరుతపులి వచ్చిందన్న సమాచారంతో ప్రజలు పెద్దఎత్తున వచ్చి ఇంటి చుట్టూ చేరి కిటికీల నుంచి చిరుతపులిని వీడియోలు తీశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు (Forest department teams)సమాచారం అందించడంతో వారు వచ్చి చిరుతపులిని బోనులో బంధించి తీసుకువెళ్లారు. మొత్తం మీద ఇంట్లోకి అతిథిగా వచ్చిన చిరుతపులి బయట జనం సందడి చూసి అటు ఇటూ తిరిగింది.(House Roams Around) 

Updated Date - 2022-10-07T15:10:32+05:30 IST