తిరుమల: మొదటి ఘట్ రోడ్డులో చిరుత కలకలం

ABN , First Publish Date - 2021-10-04T17:06:23+05:30 IST

తిరుమల: ఘాట్ రోడ్‌లో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

తిరుమల: మొదటి ఘట్ రోడ్డులో చిరుత కలకలం

తిరుమల: ఘాట్ రోడ్‌లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి మొదటి ఘాట్ రోడ్‌లోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని రోడ్డుపై చిరుత సంచరించింది. రోడ్డుపై వేగంగా పరుగెత్తుతుండగా.. ఆ సమయంలో ఘాట్ రోడ్‌లో పెట్రోలింగ్‌లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది చిరుతను చూసి హారన్ మోగించడంతోపాటు లైట్ ఫోకస్ చేయడంతో చిరుత రోడ్డుపక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఆ సమయంలో ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు లేకపోవడంతో భక్తులకు ప్రమాదం తప్పింది.

Updated Date - 2021-10-04T17:06:23+05:30 IST