Viral Video: బావిలో పడిపోయిన చిరుతపులి.. మంచం సాయంతో పైకి తెచ్చిన వెంటనే అది ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-06-27T22:35:48+05:30 IST

తమ స్వార్థం కోసం చెట్లను నరికేయడం, అడవులను ఆక్రమించడం వంటి పనులు చేస్తున్న మానవులు వన్య ప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు.

Viral Video: బావిలో పడిపోయిన చిరుతపులి.. మంచం సాయంతో పైకి తెచ్చిన వెంటనే అది ఏం చేసిందంటే..

తమ స్వార్థం కోసం చెట్లను నరికేయడం, అడవులను ఆక్రమించడం వంటి పనులు చేస్తున్న మానవులు వన్య ప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దాంతో అవి ఆహారం కోసం, ఆశ్రయం కోసం జనావాసాల వైపు వస్తున్నాయి. పంట పొలాల్లో, గ్రామ శివార్లలో తలదాచుకుంటున్నాయి. అయితే అక్కడ ఉండే బావులు వన్య ప్రాణులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో ఓ పులి బావిలో పడిపోతే గ్రామస్తులు కాపాడారు. తాజాగా ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఓ చిరుత పులి కూడా బావిలో పడిపోయింది. 


ఆ చిరుతను అటవీ శాఖ అధికారులు మంచం సహాయంతో రక్షించారు. ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్ ఖాతాలో పొందుపరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బావిలో పడిన చిరుతను మంచం సహాయంతో బయటకు తీసుకొచ్చారు. మంచం బావి పైకి చేరుకోగానే, పులి వేగంగా పైకి ఎక్కి కేకలు వేస్తూ పారిపోయింది. జంతువుల ఆవాసాల చుట్టూ ఉన్న బహిరంగ బావులను మూసివేసినప్పుడే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయని సుశాంత నంద పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-27T22:35:48+05:30 IST