మారుపాక శివారులో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-01-17T05:33:38+05:30 IST

వేములవాడ మండలం మారుపాకలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మారుపాక శివారులో చిరుత సంచారం
మారుపాక శివారులో చిరుత అడుగులను గుర్తించిన ఫారెస్టు అధికారులు

- అడుగులను పరిశీలించిన ఫారెస్టు అధికారులు 

వేములవాడ టౌన్‌, జనవరి 16 : వేములవాడ మండలం మారుపాకలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కోనరావుపేట మండలం రామన్నపేట, వేములవాడ మండలం మారుపాక, చంద్రగిరి  శివారులో చిరుత అడుగులను గుర్తించిన గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌,  సెక్షన్‌ ఆఫీసర్‌ సౌమ్య మారుపాక శివారులో అడుగులను పరిశీలించారు.  చిరుత అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మూడు గ్రామాల శివారులోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

Updated Date - 2021-01-17T05:33:38+05:30 IST