ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడను నిర్మిద్దాం

ABN , First Publish Date - 2022-07-06T05:35:33+05:30 IST

ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ వ్యాపారస్తులు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడను నిర్మిద్దాం

బాన్సువాడ టౌన్‌, జూలై 5 : ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ వ్యాపారస్తులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వ్యాపారస్తులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాపారస్తులు కొనుగోలు దారులకు వస్తువులను ప్లాస్టిక్‌ కవర్లలో అందించరాదన్నారు. ఎవరైనా ప్లాస్టిక్‌ వాడినట్లయితే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, కమిషనర్‌ రమేష్‌, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-06T05:35:33+05:30 IST